చెన్నై బౌలింగ్ కోచ్ గా అశ్విన్, మెంటర్ గా మాహీ

గబ్బా టెస్ట్ టీమిండియాలో సంతోషంతో పాటు బాధను మిగిలిచింది. ఈ టెస్టులో ఓటమి అంచున ఉన్న భారత్ డ్రాగా నిలవగా మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Written By:
  • Publish Date - December 19, 2024 / 06:10 PM IST

గబ్బా టెస్ట్ టీమిండియాలో సంతోషంతో పాటు బాధను మిగిలిచింది. ఈ టెస్టులో ఓటమి అంచున ఉన్న భారత్ డ్రాగా నిలవగా మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు తుది జట్టులో అశ్విన్ స్థానం సంపాదించాడు. అయితే మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. గబ్బా టెస్టుకు అతడిని బెంచ్ కే పరిమితం చేశారు. అశ్విన్ స్థానంలో జడేజాకు అవకాశం కల్పించారు. కానీ అశ్విన్ కి అదే చివరి మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఇదిలా ఉంటే అశ్విన్ చాలా కాలం పాటు పరిమిత ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. కానీ టెస్టులో సత్తా చాటుతున్నాడు. అయితే ఇప్పుడు అన్ని ఫార్మేట్లకు గుడ్ బై చెప్పి క్రికెట్ కు దూరమయ్యాడు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్లో అశ్విన్ ఆడతాడా లేదా అన్నది ప్రతి క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. వచ్చే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ ను కొనుగోలు చేసింది. 9 సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గూటికి చేరడంతో చెన్నై ఫ్యాన్స్ అతనికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు. అయితే ఐపీఎల్ కి ముందే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి మాత్రమే గుడ్ బై చెప్పాడు. దేశవాళీ టోర్నీలో తన ఆటని కొనసాగించనున్నాడు.

ఇకపోతే వచ్చే సీజన్లో అశ్విన్ కచ్చితంగా ఐపీఎల్ ఆడకపోవచ్చు. అటు ధోనీ కూడా ఐపీఎల్ కి ముగింపు పలకనున్నాడు. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్ గా ధోనీ, ఆ జట్టు బౌలింగ్ కోచ్ గా అశ్విన్ బాధ్యతలు చేపట్టవచ్చు. ఇప్పటికే చెన్నై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే అశ్విన్ ని చివరిసారిగా తమ జట్టులోకి ఆహ్వానించి ఉండొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.