ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ భారత హాకీ జట్టు శుభారంభం

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచి సత్తా చాటిన భారత హాకీ జట్టు ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ తొలి మ్యాచ్ లో 3-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసింది.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 08:18 PM IST

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచి సత్తా చాటిన భారత హాకీ జట్టు ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ తొలి మ్యాచ్ లో 3-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసింది. భారత్ తరపున సుఖజీత్ సింగ్ 13వ నిమిషంలో గోల్ చేయగా… 26వ నిమిషంలో ఉత్తమ్ సింగ్ , 33వ నిమిషంలో అభిషేక్ గోల్స్ చేశారు. భారత్ ఎటాకింగ్ ను చైనా ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. కాగా ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ అత్యధికంహా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. భారత్, ఆతిథ్య చైనాతో పాటు పాకిస్తాన్ , సౌత్ కొరియా, జపాన్ , మలేషియా టోర్నీలో ఆడుతున్నాయి.