ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికలు.. విద్యా సంస్థలకు 2రోజులు సెలవులు..

విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహించే గురువారంతోపాటు, అంతకుముందు రోజైన బుధవారం సెలవులు ప్రకటించింది. బుధ, గురు వారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - November 28, 2023 / 04:18 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు బుధవారం ఒక్క రోజు మాత్రమే గడువుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంద. గురువారం జరిగే ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల కోసం స్కూల్స్, కాలేజీలు అవసరమవుతాయనే సంగతి తెలిసిందే. అందుకే విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహించే గురువారంతోపాటు, అంతకుముందు రోజైన బుధవారం సెలవులు ప్రకటించింది.

ASSEMBLY ELECTIONS: ఈ జంప్ జిలానీలకు ఇబ్బందే ! కాంగ్రెస్ అభ్యర్థుల గట్టి పోటీ..

బుధ, గురు వారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. గురువారం జరిగే ఎన్నికల కోసం సిబ్బంది.. బుధవారమే ఆయా కేంద్రాలకు చేరుకుంటారు. అక్కడ ఎన్నికల సామగ్రిని కూడా నిల్వ చేయాలి. ఇందుకోసం విద్యా సంస్థల్ని స్వాధీనం చేసుకోవాలి. భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే అన్ని విద్యా సంస్థలకు కలిపి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తవ్వగా.. బుధవారం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తారు.