కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలున్నాయి. 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించాం. సీఈసీ ప్రధాన పార్టీలతో.. ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్.. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15.. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు – ఈసీ
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
ఎన్నికల తేదీలు విడుదల చేసిన ఎలక్షన్ కమీషన్.
మిజోరం..
మిజోరాం ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 13న నోటిఫికేషన్, 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23.. పోలింగ్ నవంబర్ 7, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3-కేంద్ర ఎన్నికల సంఘం.
రాజస్థాన్..
రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30న నోటిఫికేషన్, నవంబర్ 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 7న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 9.. పోలింగ్ నవంబర్ 23, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3-కేంద్ర ఎన్నికల సంఘం.
ఛత్తీస్గఢ్..
ఛత్తీస్గఢ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు విడతలుగా ఎన్నికలు.. తొలి విడదతకు అక్టోబర్ 13న నోటిఫికేషన్, అక్టోబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23.. పోలింగ్ నవంబర్ 7వ తేదీ.. రెండో దశకు అక్టోబర్ 21న నోటిఫికేషన్, అక్టోబర్ 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2.. పోలింగ్ నవంబర్ 17, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న-కేంద్ర ఎన్నికల సంఘం
మధ్యప్రదేశ్..
మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 21న నోటిఫికేషన్, 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2.. పోలింగ్ నవంబర్ 17, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3-కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..
తెలంగాణలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. నవంబర్ 3న నోటిఫికేషన్. నవంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ. నవంబర్ 30న పోలింగ్. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల.
S.SURESH