Trump: ట్రంప్ పై దాడి వెనుక ఇరాన్ ? ఉక్రెయిన్ ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హత్యకు ఎవరు కుట్ర పన్నారో ఎంక్వైరీ జరుగుతోంది. విదేశీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆ దిశగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. ట్రంప్ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అందింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ సంఘటనకు కొన్ని వారాల ముందే ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందని అంటున్నారు. అందుకే సీక్రెట్‌ సర్వీస్‌ భద్రతను పెంచింది.

  • Written By:
  • Updated On - July 17, 2024 / 03:40 PM IST

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హత్యకు ఎవరు కుట్ర పన్నారో ఎంక్వైరీ జరుగుతోంది. విదేశీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆ దిశగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. ట్రంప్ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అందింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ సంఘటనకు కొన్ని వారాల ముందే ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందని అంటున్నారు. అందుకే సీక్రెట్‌ సర్వీస్‌ భద్రతను పెంచింది.
ఇప్పుడు ట్రంప్‌పై (Trump) హత్యాయత్నం చేసిన యువకుడికి మాత్రం ఇరాన్‌ తో ఏ సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ హయాంలోనే ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖాసిం సులేమానీని డ్రోన్‌ దాడిలో అమెరికా హతమార్చింది. అప్పటి నుంచి ట్రంప్‌ను చంపుతామని ఇరాన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
ట్రంప్‌ ప్రాణాలకు ముప్పుపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ చెబుతోంది. అందుకు తగ్గుట్టగా ట్రంప్ భద్రతను పెంచుతున్నట్టు చెబుతున్నారు. ప్రతి వార్నింగ్ ని కూడా సీరియస్ గా తీసుకొని… అంతే స్పీడ్ గా తగిన ఏర్పాట్లు చేస్తామంటున్నారు అధికారులు. ట్రంప్‌ తో పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, సెక్రటరీలు, ఇతర సిబ్బందికి కూడా ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందనీ… అందుకే వాళ్ళపై నిరంతర నిఘా పెడుతున్నట్టు వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికారి తెలిపారు.
ట్రంప్ పై కాల్పులకు ఇరాన్ కుట్ర పన్నిందన్న వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్‌ ఖండించింది. అవన్నీ ట్రాష్ అంటూ ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ట్రంప్‌ నేరస్థుడని.. ఆయన్ని కోర్టులోనే శిక్షించాలన్నారు. అయితే ట్రంప్ కి ఉక్రెయిన్ నుంచి కూడా ముప్పు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే… ఉక్రెయిన్ కి అమెరికా సాయం ఆపేస్తానని ట్రంప్ ప్రకటించారు. దాంతో ఆ దేశస్థులు కూడా దాడులు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం దాడి చేసిన యువకుడికి మాత్రం… ఇరాన్, ఉక్రెయిన్ తో ఎలాంటి సంబంధాలు లేనవి అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి.