వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లంక గెలుపుతో ఆసీస్ కు కంగారు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా శ్రీలంక , న్యూజిలాండ్ తొలి టెస్ట్ తర్వాత WTC పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2024 / 07:10 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా శ్రీలంక , న్యూజిలాండ్ తొలి టెస్ట్ తర్వాత WTC పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ను చిత్తు చేసి శ్రీలంక.. ఈ టేబుల్లో మూడో స్థానంలోకి దూసుకెళ్లగా.. కివీస్ నాలుగో ప్లేస్ కు పడిపోయింది. గాలె టెస్టులోగెలుపుతో శ్రీలంక 12 పాయింట్లు సాధించింది. 8 మ్యాచుల్లో 50.00 విజయాల శాతంతో 48 పాయింట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది. ఈ మ్యాచ్ కు ముందు లంక నాలుగో స్థానంలో ఉండగా… తాజా ఓటమితో కివీస్ దిగజారింది. ప్రస్తుతం కివీస్ 42.85 విజయాల శాతంతో 36 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతోంది.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ లోనే కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో జరిగిన చెన్నై టెస్టులో గెలవడంతో భారత్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. ఫలితంగా 10 మ్యాచ్ లలో టీమిండియా 71.67 విజయాల శాతంతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మార్చి లోపు మరో 9 టెస్టులు ఆడనున్న రోహిత్ సేన కనీసం 4 గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా 90 పాయింట్లు, 62.5 విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా భారత్ కు ఫైనల్ బెర్త్ దక్కడం దాదాపు ఖాయమే. మరో బెర్త్ కోసం ఆసీస్, కివీస్, శ్రీలంక కూడా రేసులో నిలిచాయి.