ప్రపంచ క్రికెట్ లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లకు కంగారు మొదలవుతుంది. పైకి చెప్పకున్నా బుమ్రా బౌలింగ్ అంటే చాలా మంది స్టార్ బ్యాటర్లకు భయం… టీ ట్వంటీ ఫార్మాట్ లో సైతం డాట్ బాల్స్ వేసే సత్తా ఉన్న బౌలర్ గా అతనికి గుర్తింపు ఉంది. ఎన్నోసార్లు తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ లను గెలిపించాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. సిరీస్ ఆరంభం నుంచీ ప్రతీ సారీ భారత్ ను తన బౌలింగ్ తో ఆదుకుంటున్నాడు. చాలా మంది ఆసీస్ బ్యాటర్లు అతని బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు తడబడుతున్నారు. అయితే 19 ఏళ్ళ ఆసీస్ క్రికెటర్ మాత్రం బుమ్రాను లెక్క చేయడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు చోటు దక్కించుకున్న 19 ఏళ్ళ సామ్ కొంటాస్ బుమ్రా బౌలింగ్ అంటే తనకు భయం లేదని చె్పాడు. రెండు టెస్టులకు మెక్‌స్వీనే స్థానంలో జట్టులోకి వచ్చిన సామ్ కొంటాస్.. భారత పేసర్‌ను ఎదుర్కోవడానికి తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నట్లు వెల్లడించాడు. కానీ, అవేంటనేది బయటకు చెప్పనని మాట దాటేశాడు. బుమ్రాతో ఆసక్తికర సమరం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలోని అత్యంత విధ్వంసక ఫాస్ట్ బౌలర్ బుమ్రా అని తనకు తెలుసన్నాడు. కానీ బుమ్రా కోసం తన దగ్గర ఒక ప్లాన్ ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఆ ప్లాన్ ఏంటనేది మాత్రం చెప్పనని, .బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న తుది రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఈ 19 ఏళ్ల యువ బ్యాటర్ చోటు దక్కించుకున్నాడు. మెల్‌బోర్న్, సిడ్నీల్లో జరిగే టెస్టుల్లో అతను బరిలోకి అవకాశాలు ఉన్నాయి. కోన్ స్టాస్ జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. 19 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. జూనియర్ పాంటింగ్ కు పేరున్న కోన్ స్టాస్ 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 42.23 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
అలాగే భారత్ ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఏ తరఫున 73 రన్స్‌తో చెలరేగాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. సిడ్నీ థండర్ తరఫున అరంగేట్రంలోనే ఫాస్టెస్ ఫిఫ్టీ బాదాడు. సామ్ కోన్‌స్టాస్‌తో పాటు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా గాయంతో జోష్ హజెల్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.