అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడుకలు

అయోధ్య శ్రీ రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రారంభం అయ్యాయి.

  • Written By:
  • Updated On - January 22, 2024 / 12:30 PM IST

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. గర్భ గుడిలో వేదమంత్రోఛ్చారణ మధ్య వేడుకలు జరుగుతున్నాయి. బాలరాముడికి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదులతో రామ మందిరంలోకి అడుగుపెట్టారు మోడీ. మరికొన్ని నిమిషాల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది హిందువులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షిస్తున్నారు

LIVE

https://www.youtube.com/watch?v=-vf05vYE7mc