Ayodhya Ram Mandir: రాముడి ప్రతిష్ట వేళ ఇంట్లో పూజ ఎలా చేయాలి ?

అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ మనం ఇంట్లో ఎలా పూజలు నిర్వహించుకోవాలి. ఏయే గ్రంథాలు చదువుకోవాలి.... రాముడికి నైవేధ్యాలు ఎలా సమర్పించాలి...

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 09:04 AM IST

ప్రపంచంలోని కోట్ల మంది హిందువులు ఎదురు చూస్తున్న రోజు ఇవాళ… అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరుగుతున్న వేళ…జనవరి 22 … అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో  బాల రాముడి ప్రాణ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నారు.

మనం ప్రస్తుతం అయోధ్యలో లేము… ఇంట్లో ఉన్నాం… కానీ బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నాం అనే అనుభూతి మనం చెందాలంటే ముందుగా మీరు పండితులు చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది.

ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకోండి…. దేవుళ్ళ విగ్రహాలను కూడా శుభ్రం చేసుకోవాలి.  దేవుడి పటాలను శుభ్రమైన గుడ్డతో తుడవాలి… తర్వాత రాముడి విగ్రహం ఉంటే స్నానం చేయించండి… మీ దగ్గర రాముల వారి ఫోటో ఉన్నా సరే… శుభ్రమైన గుడ్డతో తుడవాలి…

ఉత్తర – తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్యం అంటా కదా… ఆ దిక్కులో పూజలు చేయాలి… సాధారణంగా మన పూజా గది ఈశాన్యం మూలనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈశాన్యం మూల పూజలు చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు చెబుతున్నారు.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సమయంలో ఇంట్లో పూజలు ఎలా చేయాలి అంటే…

మీరు శుచిగా స్నానం చేసి… మీ నుదిటిపై బొట్టు పెట్టుకోండి… బొట్టు అనేది ప్రతి హిందువుకీ చాలా అవసరం అని మీకు తెలుసు… వీలైతే తెల్లని వస్త్రాలు… లేదంటే లేత రంగు వస్త్రాలను కట్టుకోండి… పాలు, తేనె, పండ్లు ఇతర నైవేద్యాలతో శ్రీరాముని విగ్రహానికి అభిషేకం… ఉత్సవ స్నానం చేయించాలి… పూల చేసే పీఠం కింద లేదా మందరం దగ్గర ముగ్గు వేసి చక్కగా అలంకరించాలి… స్వస్తిక్ లేదా ఓం గుర్తు వచ్చేలా ముగ్గుతో తీర్చిదిద్దాలని పండితులు చెబుతున్నారు…ఇప్పుడు మీ పూజగదిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి… దాని మీద ఎర్రటి వస్త్రాన్ని వేసి… శ్రీరాముడి విగ్రహం లేదా ఫోటోను అక్కడ అమర్చండి.

ఆ తర్వాత

శ్రీరాముడిని పూజించిన తర్వాత…ఆయనకు వీర భక్తుడైన హనుమాన్ ను కూడా పూజించాలి.  ఇప్పుడు మరో ఎర్రటి వస్త్రాన్ని రాముల వారికి సమర్పించాలి… గుర్తుంచుకోండి… రాముడికి ఒక్కడికి పూజ చేస్తే సరిపోదు… హనుమంతుల వారికి కూడా పూజలు చేయాలి… అప్పుడే మీరు చేసిన పూజ సంపూర్ణం అవుతుందని గమనించండి…

రాముల వారితో పాటు హనుమాన్ ను పూజిస్తే… మనకు శ్రీసీతారామ చంద్రుల వారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి.

రాముడి విగ్రహానికి నీటితో అభిషేకం చేసిన తర్వాత…పంచామృతాలతో స్నానం చేయించాలి.. ఆ తర్వాత మళ్ళీ నీటితో స్నానం చేయించాలి…

రాముడికి తిలక ధారణ చేసి… పూవులు… ధూపం, దీపాలతో పూజలు చేయాలి… శ్రీరాముడికి నైవేద్యంగా … పండ్లు, పాలు, పానకం… ఇంకా మీ శక్తి మేరకు ప్రసాదాలను సమర్పించవచ్చు.

రామజపం స్తుతితో రాముడిని పూజించడం ప్రారంభించారు.

రాముడిని పూజించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రామరక్షా స్తోత్రాన్ని పఠించాలి.  రామ రక్షా స్తోత్రం పఠిస్తే… ఆ శ్రీరాముడి ఆశీసులు ఎప్పుడూ కూడా మనపై ఉంటాయని గమనించండి…

నైవేద్యాల సమర్పణ అయ్యాక…చివరగా శ్రీరాముడికి హారతి ఇచ్చి పూజను ముగించాలి…

తర్వాత… మన ఇంట్లో ఉన్న రామాయణ గ్రంథంను పఠింవచ్చు… లేదంటే రామ చరిత మానస్ ఉంటే దాన్ని అయిన పఠించవచ్చు…

ఇంక సాయంత్రం వేళ ఏం చేయాలి అంటే… ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి…

దీపావళి రోజులు మనం ఎలాగైతే సాయంత్రం వేళల్లో ఇంటి ముందు దీపాలను వెలిగించి పెడతామో

అలాగే… ఇవాళ ప్రాణ ప్రతిష్ట రోజు కూడా దీపాలను వెలిగించండి..

సర్వే జనా సుఖినోభవంతు…