AYODHYA : బాల రాముడి ప్రాణ ప్రతిష్ట…. అయోధ్యలో అపూర్వఘట్టం !

500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది.  అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది.  ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - January 22, 2024 / 01:05 PM IST

500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది.  అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది.  ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.

వందల యేళ్ళుగా భారతీయులు వేయి కళ్ళతో ఎదురు చూసిన మధురక్షణాలు ఇవి.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకోవాలనీ… అందులో రామయ్య తండ్రిని ప్రతిష్టించుకోవాలని ఎందరో ఎదురు చూస్తున్నారు. ఆ మహోన్నత అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసి భక్తజనం పులకించి పోయింది.   సరిగ్గా 12 గంటల 29 నిమిషాల తర్వాత అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది.  ప్రధాని నరేంద్రమోడీ ఈ క్రతువును సంపూర్ణంగా పూర్తి చేశారు.  ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో రామమందిరంపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.

అయోధ్యలోని శ్రీరామ భవ్య మందిరంలో… అందంగా అలంకరించిన ఆ శ్రీరామచంద్రమూర్తిని నివితీరా చూసి భక్తులు పరవశించిపోయారు. మొత్తం 84 సెకన్ల పాటు ఈ క్రతువు జరిగింది. ధనుర్దారియై సకలాభరణ భూషితుడై కనిపించాడు శ్రీరాముడు.  పసిడి కిరీటం, పట్టువస్త్రంతో నీలమేఘశ్యాముడు మెరిసిపోయాడు.  గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో మహా క్రతువు జరిగింది. పద్మ పీఠంపై మెరిసిపోతున్ననీల మేఘశ్యాముడిని చూసి భారతీయులు మురిసిపోయారు. జై శ్రీరామ్ అంటూ రామ నామంతో ప్రతి భారతీయుడి హృదం ఉప్పొంగి పోయింది. అత్యంత రమణీయంగా ప్రాణప్రతిష్ట మహోజ్వల ఘట్టం కొనసాగింది. 50 వాయిద్యాల మంగళ ధ్వనులతో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం కొనసాగింది. అంతకుముందు రాముల వారికి పట్టు వస్త్రాలు, ఛత్రం, పాదుకలను తీసుకొచ్చారు ప్రధాని మోడీ.

అయోధ్యలో త్రేతాయుగం నాటి సంబరాలు కనిపించాయి. ఈ కమనీయ వేడుకను చూడటానికి ఎన్నో యేళ్ళుగా ఎదురు చూస్తున్నామని ఆనందంతో పులకించి పోయారు భక్త జనం.  రాముడికి ఐదు శతాబ్దాల వనవాసం వీడినట్టుగా ఉందని సంబుర పడ్డారు.