AYODHYA BALAK RAM: పవళింపు సేవ.. బాల రాముడికి రెస్ట్ కావాలి ! మధ్యాహ్నం నిద్రకి గంట విశ్రాంతి

అప్పట్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామ్ లల్లా దర్శనం ఉండేది. కానీ భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి పదింటి దాకా ఆలయం తెరిచే ఉంచుతున్నారు. కానీ బాల రాముడిని ఉదయం నాలుగింటికే నిద్ర లేపుతున్నారు ఆలయ పూజారులు.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 04:43 PM IST

AYODHYA BALAK RAM: అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడిని చూడటానికి లక్షల మంది భక్తులు తరలి వెళ్తున్నారు. రోజుకు 3 లక్షల మంది దాకా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ రామ మందిరం నిర్మాణం కోసం దశాబ్దాలుగా భక్తులు ఎదురు చూశారు. ఇప్పుడు మందిరం నిర్మాణం అవగా.. అందులో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట కూడా జరిగింది. దాంతో భక్తులు అయోధ్యకు బయలుదేరి వెళ్తున్నారు. జనవరి 23నాడు అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువు దీరాడు.

Congress Bank Accounts: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బ్యాంకు ఖాతాల స్తంభన.. ఆ వెంటనే

అప్పట్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామ్ లల్లా దర్శనం ఉండేది. కానీ భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి పదింటి దాకా ఆలయం తెరిచే ఉంచుతున్నారు. కానీ బాల రాముడిని ఉదయం నాలుగింటికే నిద్ర లేపుతున్నారు ఆలయ పూజారులు. తెల్లవారు జామున నాలుగు నుంచి ఆరింటి దాకా.. అంటే దాదాపు 2 గంటల పాటు స్వామి వారికి ప్రాత:కాల పూజలు, ఇతర ఆచారాలు నిర్వహిస్తున్నారు. అంటే భక్తులకు బాలక్ రామ్ దర్శనం ఇవ్వడానికి రెండు గంటల ముందు నుంచే నిద్ర లేస్తున్నాడు. మన ఇంట్లో ఐదేళ్ళ బాలుడికి రోజులో మనం ఎంత రెస్ట్ ఇస్తాం.. ఎంత సేపు పడుకోబెడతాం.. కనీసం 8 నుంచి 10 గంటలైనా పడుకోబెడతాం. అలాగే బాల రాముడికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. నిద్ర సరిగా లేకపోతే మానసికంగా ఒత్తిడిని ఎదుర్కుంటాడని అంటున్నారు అయోధ్య ఆలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. బాల రాముడు అన్నేసి గంటలు మెలకువతో ఉండటం మంచిది కాదంటున్నారు. అందుకే ఇక నుంచి మధ్యాహ్నం పూట ఓ గంట సేపు ఆయనకు విశ్రాంతి ఇవ్వబోతున్నారు.

మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర దాకా అయోధ్య ఆలయం తలుపులు మూసి ఉంచుతామని చెప్పారు. భక్తులంతా సహకరించాలని కోరారు ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్. దశాబ్దాలుగా అయోధ్యలోని తాత్కాలిక టెంట్‌లో ఉన్న రామ్ లల్లా దర్శన విషయంలోనూ ఇలాంటి సంప్రదాయాన్ని పాటించేవారు. తాత్కాలిక టెంట్‌లో ఉన్న అప్పటి చిన్న గుడిని కూడా మధ్యాహ్నం వేళల్లో 2 గంటల పాటు మూసి ఉంచేవాళ్ళు. ఆలయాల్లో ఇలాంటి సంప్రదాయాలను ఖచ్చింతంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఐదేళ్ళ బాల రాముడు కాబట్టి విశ్రాంతి ఇవ్వాలన్న రామమందిర నిర్వాహకుల నిర్ణయాన్ని కొందరు భక్తులు కూడా సమర్ధిస్తున్నారు.