Ayodhya Ram Mandir: 5వందల ఏళ్ల కల సాకారం అయింది. అయోధ్యలోని భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరాడు. ప్రధాని చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయోధ్యలో బాల రాముడిని.. రామ్‌లల్లా అని ఇప్పటివరకు పిలుస్తూ వచ్చారు. ఐతే ఇప్పుడు రామ్‌లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. శ్రీరాముడి విగ్రహానికి బాలక్ రామ్‌గా పేరు పెట్టినట్లు.. ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.
YS SHARMILA: షర్మిలను నడిపిస్తోంది ఆయనేనా.. ఆమె ధైర్యం అదేనా..?
అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని.. అందుకే ఈ పేరును నిర్ణయించామని.. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని వివరించారు. ఇక అటు బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించారు. ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. ప్రతిరోజూ మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇవ్వనున్నారు. ఇక పూరి, కూరతో పాటు.. రబ్‌డీ ఖీర్, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు.
సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో బాలక్ రామ్ దర్శనం ఇవ్వనున్నారు. ఇక అటు స్వామి వారి దర్శనానికి ట్రస్ట్ అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్య ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు రాముడి దర్శనానికి వస్తారని అంచనాలు వినిపిస్తున్నాయ్. దీనికోసం తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు.