Chandrababu VS Pawan Kalyan : బాబు పొత్తుధర్మం పాటించట్లేదు.. టీడీపీకి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

టీడీపీకి (TDP) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Assembly Election) రెండు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. కానీ పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం వివాదస్పదమైంది.

టీడీపీకి (TDP) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Assembly Election) రెండు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. కానీ పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం వివాదస్పదమైంది. దాంతో రెచ్చిపోయిన పవన్ తాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా రెండు సీట్లు ప్రకటించాడు. అలాగే మా నాన్నే సీఎం అంటున్న లోకేష్ నీ వదల్లేదు పవన్ కల్యాణ్. తెంచుకోవడం తేలికే అంటూ సంకేతాలు పంపారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఓ వైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ నియోజకవర్గాల ఇంఛార్జుల పేర్లతో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నారు. అయితే కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన మాత్రం ఇంకా సీట్ల గురించి చర్చలే మొదలుపెట్టలేదు. కానీ చంద్రబాబు ఈమధ్య మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. దాంతో జనసేన శిబిరంలో అలజడి మొదలైంది. బాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తుంటే మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి అని పవన్ కల్యాణ్ పై పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో జగన్, వైసీపీతో పాటు పొత్తులపైనా మాట్లాడారు. మండపేటలో తమకు మంచి అవకాశాలున్నాయనీ… కానీ చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu)ను సుతిమెత్తగానే ఏకిపారేశారు జగన్. 40యేళ్ళ రాజకీయ అనుభవం ఉంది. మూడు సార్లు సీఎంగా పనిచేశారు అంటూనే ఆయనకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని చెప్పుకొచ్చారు పవన్. పన్లో పనిగా మా బాబే సీఎం అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని కూడా వదల్లేదు. పొత్తు ధర్మం మరిచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు పవన్. తెంచుకోవడం తేలిక… కానీ నిలబెట్టడమే కష్టం అంటూ… దేనికైనా సిద్ధమన్న సంకేతాలు టీడీపీకి పంపారు. రిపబ్లిక్ డే సందర్భంగా తాను కూడా రెండు స్థానాలు ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు పవన్.

జగన్ ను ఈసారి అధికారంలోకి రాకుండా ఉండాలని టీడీపీతో పొత్తుకు పవన్ కల్యాణే ఇంట్రెస్ట్ చూపించారు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని లేకపోయినా…. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాల్సి వచ్చింది. టీడీపీతో దోస్తీ చేసి ఎన్నో కొన్ని సీట్లకు పవన్ రాజీ పడిపోతాడనీ… ఆయనకు సరిగా రాజకీయం తెలియదంటూ బయటి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు, కాపు లీడర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాటన్నింటికీ జవాబు చెప్పాడు పవన్. తనకు రాజకీయం తెలియకుండానే…ఇక్కడికి రాలేదన్నారు. అన్ని నియోజకవర్గాల గురించీ అవగాహన ఉందన్నారు. ఈసారి తనను నమ్మి అధికారం అప్పగిస్తే… ఐదేళ్ళల్లో మీ గౌరవానికి భంగం రాకుండా చూస్తానని పవన్ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు.

టీడీపీ-జనసేన మధ్య ఏర్పడిన ఈ చిన్న గ్యాప్ ను పూడ్చుకునేందుకు తొందర్లనే చంద్రబాబు – పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. అలాగే బీజేపీతో కలసి పొత్తు పెట్టుకునే విషయంలోనూ ఓ క్లారిటీకి రానున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలసి కూటమిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మీటింగ్ అయ్యాక… ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడాలని పవన్ నిర్ణయించారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది. ఆ లోపే బీజేపీ, టీడీపీతో పొత్తుల సంగతి తేల్చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.