చాలా వరకు దేశంలో.. పలు రాష్ట్రాల్లో పిల్లలు తమ ఇండ్లకు దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారికి హాస్టల్స్ నుంచే తమకు కావల్సిన ఆహారం వస్తుంది. అక్కడే వారి కుడు గుడ్డ అంత.. గా చాలా సార్లు హాస్టల్ లో ఆహార విషయంలో ఎన్నో సంఘటను జరిగాయి. మనం కళ్లారా చూశాం.. కొన్ని హాస్టల్ అయితే ఆహార నాణ్యత లోపించడంతో ఆ హాస్టల్స్ మూతబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం..
ఇక వివరాల్లోకి వెళ్తే.. హాస్టల్స్ ఉన్న విద్యార్థులు హాస్టల్స్ ఉండే ఆహారంలో బొద్దింక రావడం, పురుగులు రావడం, చూసింటారు. కానీ పాము పిల్ల రావడం చూసుంటారా.. కనీసం విన్నారా.. అలాంటి ఘటనే బిహార్ రాష్ట్రంలోని ఓ హాస్టల్ లో జరిగింది.
బిహార్ లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. ఈ ఘటన బంకాకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. అది తెలియక భోజనం చేశారు కొందరు విద్యార్థులు.. భోజనం తర్వాత ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. వెంటనే 15 మంది విద్యార్థులను బంకిలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులందరినీ తిరిగి కళాశాలకు పంపించి. తాము తినే ఆహారంలో చనిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయంలో ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సదర్ ఎస్‌డిఎం, ఎస్‌డిపిఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత బంకా జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్ కూడా కళాశాలకు చేరుకొని స్వయంగా విచారణ చేపట్టారు. ఆహార నమూనాలను టెస్టింగ్ నిమిత్తం ల్యాబ్ కు పంపారు. ఆ ఆహారంలో నాణ్యత లేదని మెస్ ఓనర్ కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు ఈ పరిస్థితిని వివరించిన తర్వాత మళ్లీ ఆహారం సిద్ధం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్, విద్యార్థులు కలిసి రాత్రి భోజనం చేశారు.