గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఒకేసారి ఏకంగా రూ. 101.50 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నవంబర్ 1 ఈరోజు నుంచి గ్యాస్ చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచడం ఇది రెండో సారి.
కమర్షియల్ సిలిండర్ పై.. ధరలు
- ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,833 కి చేరింది.
- ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర
- కోల్ కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,943,
- ముంబైలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,785,
- చెన్నైలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,999.50,
- బెంగళూరులో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,914.50
- హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2059.50
- విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1991.50 గా ఉంది.
ప్రస్తుతానికి గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ కు మాత్రం మినహాయింపును ఇచ్చాయి. ( డొమెస్టిక్ సిలిండర్ )
- ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 903
- కోల్ కత్తాలో రూ. 929
- ముంబైలో రూ. 902.5
- ఇక చెన్నైలో రూ. 918.50
- బెంగళూరులో రూ. 905.50
- హైదరాబాద్ లో ధర రూ. 955
- విజయవాడలో రూ. 927 గా ఉంది.