మూవీ లవర్స్ అందరికీ ఇది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో సినిమా థియేటర్స్ మూతబడబోతున్నాయి. కానీ పర్మనెంట్‌గా కాదు. కొన్ని రోజులు మాత్రమే. దీనికి కారణం సినిమాలు లేకపోవడం. రిలీజ్‌కు రెడీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని థియేటర్స్ మేనేజర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్స్ మూసేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. మార్కెట్‌లోకి ఓటీటీలు ఎప్పుడు వచ్చాయో అప్పుడే థియేటర్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను లవ్ చేసేవాళ్లు తప్ప మిగతా వాళ్లు థియేటర్స్‌కు రావడం మానేశారు.
తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ ఐతే తప్ప చాలా మంది థియేటర్స్‌లో సినిమా చూడటం మానేశారు. ఓటీటీకి వచ్చా చూద్దాంలే అనే దోరణే చాలా మందిలో కనిపిస్తోంది. ఇక కొన్ని సినిమాలు ఐతే నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. దీంతో థియేటర్ ముఖం కూడా చాలా మంది చూడటంలేదు. ఇక పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చినా.. కొన్ని రోజులకే ఓటీటీల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వారం రోజులు సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుందో అది మాత్రమే సినిమా కలెక్షన్ అనే స్థాయికి పరిస్థితి చేరింది. ఎందుకంటే ఒకసారి సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. థియేటర్‌కు రావాలి అనుకునే ఆడియన్స్ కూడా ఇక థియేటర్‌కు రారు. ఇంట్లో ఫోన్‌లోనే సినిమా చూసేస్తారు.
ఇది థియేటర్స్‌ను చావు దెబ్బ కొడుతోంది. అంతో ఇంతో వరుసగా సినిమాలు రెడీగా ఉన్నా.. ప్రతీ శుక్రవారం థియేటర్స్‌లో కాస్తో కూస్తో సందడి కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీగా లేవు. చిన్న సినిమాల కోసం ఆడియన్స్ థియేటర్‌కు వచ్చే అవకాశం లేదు. కొన్ని రోజులు థియేటర్స్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మేనేజ్‌మెంట్. అందుకే ఈ గ్యాప్ తీసుకున్నారు. 10 రోజుల తరువాత యదావిధిగా థియేటర్స్ మళ్లీ ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఓటీటీలు థియేటర్స్ పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టాయి.