CM Kejriwal : కేజీవాల్ కు బెయిల్.. లోక్ సభ ఎన్నికల్లో సీఎం కేజ్రీవాల్ ప్రచారం..

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case) కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా కేజీవాల్కు (CM Kejriwal) సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case) కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా కేజీవాల్కు (CM Kejriwal) సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా కేజీవాలు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. దీంతో కేజ్రివాల్ రెండు నెలల తరువాత బయటకు రానున్నారు. ఈ కేసులో మార్చి 21న కేజీవాల్ను ఈడీ అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైలులో ఉన్నారు. కాగా బెయిల్ కోసం గతంలో కొన్ని సార్లు పిటిషన్ వేసినప్పటికీ కోర్టు నిరాకరించింది. మొత్తానికి ఎన్నికల ముందు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ (AAP Party) లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Suresh SSM