Odisha: ఒడిశా ప్రమాదానికి కారణం అతనేనా..

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రక్తపు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆ యాక్సిడెంట్‌లో గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ జూన్‌ 18న చనిపోయాడు. అతని మరణంతో మృతుల సంఖ్య 292కు చేరింది. వందల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. చరిత్ర మర్చిపోలేని ఈ దుర్ఘటనపై సీబీఐ జూన్‌ 6న విచారణ ప్రారంభించింది.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 07:12 PM IST

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో.. అదే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఎలక్ట్రానిక్‌ ఇంటర్లాకింగ్‌ సిస్టమ్‌లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు సీబీఐకి నివేదిక ఇచ్చారు. దీంతో సీబీఐ ఫోకస్‌ మొత్తం బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్‌పై పెట్టింది. ఇప్పటికే ఓ సారి నిందితుడిని విచారణ కూడా చేసింది.

మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కానీ అమీర్‌ ఖాన్‌ మాత్రం రాలేదు. నిజం బయట పడుతుంది అనుకున్నాడో.. లేక సీబీఐ తనను వదిలిపెట్టదు అనుకున్నాడో తెలియదు కానీ.. చెప్పా పెట్టకుండా కుటుంబతో సహా పారిపోయాడు. రెండు రోజులు వరుసగా నోటీసులు పంపించిన అధికారులు నిన్న అమీర్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే అమీర్‌ ఖాన్‌ పరారీలో ఉన్నాడు. దీంతో ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అమీరే అని సీబీఐ అనుమానిస్తోంది. ప్రస్తుతం అమీర్‌ ఇంటి దగ్గర నిఘా ఏర్పాటు చేసింది. అమీర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.