BALKA SUMAN: బాల్క సుమన్ ఎక్కడ..? పరారీలో మాజీ ఎమ్మెల్యే..

బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Written By:
  • Updated On - February 9, 2024 / 07:42 PM IST

BALKA SUMAN: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కనిపించడం లేదు. సీఎం రేవంత్‌పై పరుష పదజాలం వాడిన సుమన్‌పై.. మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరోజు నుంచి ఆయన కనిపించడం లేదు. సుమన్‌పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ప్రస్తుతం సుమన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఆయన జాడ తెలియడం లేదు.

PM MODI-YS JAGAN: చంద్రబాబు, మోదీతో జగన్ మీటింగ్‌.. భేటీలో ఏం జరిగింది.. రాజకీయ సంచలనాలు ఖాయమా..?

పాగల్ గాడిని చెప్పుతో కొట్టాలి.. కానీ సంస్కారం అడ్డువస్తోంది. బిడ్డా ఖబడ్దార్.. ఇంకోసారి కేసీఆర్‌‌ను ఏమైనా అంటే లక్షమందితో తొక్కుతాం అంటూ.. సీఎం రేవంత్‌ మీద బాల్కసుమన్ రెచ్చిపోయారు. మీడియా ముందు చెప్పు చూపించిన మరీ వార్నింగ్ ఇచ్చాడు. మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమీక్ష స్థాయి సమావేశంలో సుమన్ ఈ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారాయి. బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజానికి రేవంత్‌, సుమన్ మధ్య.. చాలాకాలంగా రాజకీయంగా విభేదాలు ఉన్నాయ్.

బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. రేవంత్, సుమన్ మధ్య మాటల యుద్ధం జరిగేది. ఐతే ఇదంతా గతం. ఇప్పుడు రేవంత్ సీఎం హోదాలో ఉన్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు ఏంటి అంటూ సుమన్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఏమైనా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.