Bandaru Satyanarayana Murthy: బండారుకు టిక్కెట్ వస్తుందా..? మూడు సీట్లపై టీడీపీలో గందరగోళం

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్‌ను ప్రకటించింది అధిష్టానం. కానీ ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆ నియోజకవర్గానికి చెందిన PVG కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కానీ ప్రసాద్‌కి మాత్రం వద్దని టీడీపీ హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 04:06 PM IST

Bandaru Satyanarayana Murthy: ఏపీలో పెందుర్తి టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి. టీడీపీ అధిష్టానంపై అలకబూనారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. అయితే బండారుకి ఇప్పుడు అదృష్టం కలిసొచ్చేలా ఉంది. మాడుగుల టీడీపీలో 3 వర్గాల పోరు నడుస్తుండటంతో.. మధ్యే మార్గంగా ఆ సీటు బండారుకు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయిందట. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్‌ను ప్రకటించింది అధిష్టానం. కానీ ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆ నియోజకవర్గానికి చెందిన PVG కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు.

తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కానీ ప్రసాద్‌కి మాత్రం వద్దని టీడీపీ హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలీక టీడీపీ అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే ఈముగ్గురికీ కాకుండా బండారు సత్యనారాయణ మూర్తిని మాడుగుల నుంచి నిలబెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా బండారువైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీఎం రమేష్ రిక్వెస్ట్‌తో రామానాయుడు కూడా బండారుని బలపరిచే ఛాన్సుంది. అంతేకాదు మాడుగులలో బండారుకు బలమైన అనుచర గణం ఉంది. బంధువులు కూడా ఉన్నారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కూతురు అనురాధకు నియోజకవర్గంలో ఆశించినంత ఆదరణ లేదు. అందువల్ల మాడుగుల అసెంబ్లీ స్థానం బండారుకు ప్లస్ అవుతుందని బావిస్తున్నారు.

అధిష్టానం కూడా అనపర్తికి అభ్యర్థిని ప్రకటిస్తూనే.. మాడుగులలో మార్పులు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ఇంకా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో పునరాలోచన చేస్తోంది టీడీపీ. ఉండి నియోజకవర్గం నుంచి రఘురామరాజుకి అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. అయితే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి శివరామరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల నామినేషన్లకు ఇంకా వారం రోజులే టైమ్ ఉంది. అందువల్ల.. ఉండి, అనపర్తి, మాడుగల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.