దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జులై 4న స్కూళ్లు అండ్ కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTA ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి. గత ఐదేళ్లలో మొత్తం 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. పదేళ్లుగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షా పేపర్లు లీకేజీలు అయ్యి దేశ వ్యాప్తంగా విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు విద్యా వ్యవస్థలపై మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు రేపు స్వచ్ఛందంగా మూసి వేయాలని విద్యార్థి సంఘ నేతలు కోరారు.