బీజేపీ పార్టీ (BJP Party) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ (Karimnagar MP) బండి సంజయ్ (Bandi Sajay) రైతు దీక్ష ప్రారంభమైంది. కరువుతో రైతులు బాదపడుతున్నారు. రైతుల సమస్యల పరిష్యారం కోసం నేడు ఉదయం జిల్లాలని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ, పంట నష్ట పరిహారం, రూ.500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్ చేస్తు దీక్షకు దిగారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.తో దీక్ష చేస్తున్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై బండిసంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టారు. వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలు.. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని తమతో కలిసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ కోరారు.