BANDI SANJAY: చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు బీజేపీ నేత బండి సంజయ్. కరీంనగర్‌లో శనివారం జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై బండి విమర్శలు చేశారు. “చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయి. అయినా రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ (తెలంగాణ పొలిటికల్ లీగ్) కప్ గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం.
JANASENA: జనసేన యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఇది ఎవరి పని..?
దేశమంతా క్రికెట్‌లో ఐపీఎల్ జోష్ నడుస్తుంటే.. రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) నడుస్తోంది. మోదీ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఎన్డీఏ టీమ్.. ఇండియా కూటమి టీమ్‌ను చిత్తుగా ఓడిస్తుంది. 400 పాయింట్లతో ఐపీఎల్ కప్ గెలవబోతోంది. తెలంగాణలో టీపీఎల్ కోసం బీజేపీ తరఫున 17 మంది సభ్యులం ఉన్నాం. కాంగ్రెస్‌కు ఇంకా ఆటగాళ్లే దొరకలేదు. బీఆర్ఎస్‌కు టీమ్ సభ్యులున్నా నిరాశలో ఉన్నారు. అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ అని నమ్మించి మోసం చేశారు. వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా అందడం లేదు. రైతులు అరిగోస పడుతున్నరు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనడం లేదు.
తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. మహిళలకు మహాలక్ష్మీ పథకంతో రూ.2,500లు ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చలేదు. వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు చేస్తామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు. రూ.3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించాయి” అని బండి సంజయ్ అన్నారు.