BANK HOLIDAYS: మార్చ్‌లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

బ్యాంకుల్లో రెగ్యులర్‌గా ట్రాన్జాక్షన్స్‌ చేసేవాళ్లు ఉద్యోగులకు బ్యాంక్‌ హాలిడేల పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యం. నార్మల్‌ ఈ బ్యాంక్‌ హాలిడేలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిసైడ్‌ చేస్తుంది.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 02:03 PM IST

BANK HOLIDAYS: మనుషుల జీవితంలో బ్యాంక్‌లు ఓ పార్ట్‌గా మారిపోయాయి. ఈరోజుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ లేనివాళ్లు దాదాపుగా ఉండరు. డబ్బు దాచుకోడానికి, డిపాజిట్లకోసం అంతా బ్యాంక్‌కు వెళ్లాల్సిందే. ఇక ఇన్సూరెన్స్‌లు అనీ, లోన్స్‌ అనీ ఏదో ఒకరకంగా ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమయంలో బ్యాంక్‌కు వెళ్లక తప్పదు. దానికోసం చాలా టూం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుక్ంటే బ్యాంకుల్లో అంత ఫాస్ట్‌గా పని ఐపోతుందా అంటే కుదరదు. మినిమం సగం డే కేటాయించనిదే బ్యాంక్‌లో ఏ పెద్ద పనీ కాదు. అన్ని బ్యాంక్‌లు అలాగే ఉంటాయని ఏం లేదు కానీ.. చాలా వరకూ బ్యాంకులు మాత్రం అలాగే ఉన్నాయి.

Anant Ambani: ధోనీ,బ్రావో దాండియా స్టెప్స్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో జోష్

అలా ఉన్న పనులు ఆపుకొని మరీ బ్యాంకుకు వెళితే.. తీరా ఆరోజు సెలవు అని తెలిస్తే ఎంత నిరాశగా, కోపంగా అనిపిస్తుంది. అందుకే బ్యాంకుల్లో రెగ్యులర్‌గా ట్రాన్జాక్షన్స్‌ చేసేవాళ్లు ఉద్యోగులకు బ్యాంక్‌ హాలిడేల పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యం. నార్మల్‌ ఈ బ్యాంక్‌ హాలిడేలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిసైడ్‌ చేస్తుంది. దేశంలో ఒక్కో రాష్ట్రంలో స్థానిక పండగలను బట్టి బ్యాంకులకు సెలవుల్లో తేడాలు ఉంటాయి. అలా 2024 మార్చ్‌లో దేశవ్యాప్తంగా మార్చ్‌ నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు వస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా 14 రోజులు బ్యాంకులు మూసే ఉంటాయా అంటే.. కాదు. కేవలం ఇక్కడి బ్యాంకులకు హాలిడే డిక్లేర్‌ చేసిన రోజుల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. నార్మల్‌గా ఉన్న నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు కాకుండా ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారో ప్రత్యేకంగా ప్రకటించింది ఆర్బీఐ. మార్చి 1న మిజోరంలో బ్యాంకులకు సెలవు ఉంది. ఇక్కడ ఛాప్‌ఛర్ కుట్ జరపుకునే నేపథ్యంలో సెలవు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా చాలా చోట్ల బ్యాంకులకు సెలవు ఉంది. మార్చి 12న రంజాన్ ప్రారంభం నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంది.

బిహార్ దివస్ నేపథ్యంలో మార్చి 22న బ్యాంకులకు పట్నాలో హాలిడే ఉంది. భగత్‌సింగ్ మార్టిర్‌డమ్ డే నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మార్చి 23న బ్యాంకులకు సెలవు ఉంది. హోలీ నేపథ్యంలో మార్చి 25న చాలా చోట్ల బ్యాంకులకు సెలవు ఉంది. హోలీ సందర్భంగా మార్చి 26 న ఒడిశా, మణిపుర్, బిహార్‌లో సెలవు ఉంది. మార్చి 27న బిహార్‌లో హోలీ సందర్భంగా అక్కడ సెలవు ఉంది. గుడ్‌ ఫ్రైడే నేపథ్యంలో మార్చి 29న చాలా చోట్ల బ్యాంకులకు సెలవు ఉంది. ఇలా ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి మొత్తం 14 రోజులు ఉద్యోగులకు సెలవులు దొరకబోతున్నాయి. ఇలా వరుస సెలవులు ఉన్న నేపథ్యంతో కస్టమర్లు ఈ డేట్స్‌కు అనుగుణంగా బ్యాంక్‌ లావాదేవీలు ప్లాన్‌ చేసుకోవాలి అనేది బ్యాంక్స్‌ నుంచి ఉన్న రిక్వెస్ట్‌.