భారత్ పెట్టుకున్నందుకు మాల్దీవులు (Maldives) ఘోరంగా దెబ్బతింది. ఆ దేశం దివాలా తీసింది. తమ దేశం ఆర్థికంగా పతనమవుతోందనీ… అప్పులను రీషెడ్యూల్ చేయమంటూ IMFకు రిక్వెస్ట్ చేసింది.
చైనాకు (China) 3 బిలియన డాలర్ల అప్పు ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డ్రాగన్ కంట్రీ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు బాధ్యతలు చేపట్టాక జనవరి నెలలో చైనాకి వెళ్లి వచ్చాడు. అధ్యక్షుడితో పాటు వివిధ నేతలను కలుసుకున్నాడు. ప్రస్తుత రుణాలను వాయిదా వేయడంతో పాటు మరింత సాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మయిజ్జుని అంతగా నమ్మని చైనా… ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేసింది. పైగా తీసుకున్న అప్పులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) లక్షద్వీప్ (Lakshya Deep) కి వెళ్ళిన తర్వాత మాల్దీవుల మంత్రులు భారత్ తో పాటు ప్రధానిపైనా దారుణంగా కామెంట్ చేశారు. దాంతో టూరిజం అంటే చాలు… మాల్దీవులకు పరిగెత్తుకెళ్లే మనవాళ్లు బాయ్ కాట్ మాల్దీవులకు పిలుపు ఇచ్చారు. సినీ నటులు, క్రికెటర్లు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా మాల్దీవులకు వెళ్ళొద్దని పిలుపు ఇచ్చారు. చాలామంది ప్రముఖులు తమ టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో మాల్దీవులకు ఇండియా నుంచి వచ్చే ఆదాయం మొత్తం పడిపోయింది. అక్కడి టూరిజం ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతింది.
చైనా అండతో చెలరేగిపోయిన మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు… భారత సైనికులు మే 10 లోగా తమ దేశం విడిచి వెళ్ళాలని డెడ్ లైన్ కూడా పెట్టాడు. అయితే మయిజ్జు చేపట్టిన భారత్ వ్యతిరేక విధానంపై మాల్దీవుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్ లో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాయి. గత అధ్యక్షుల కాలంలో భారత్ – మాల్దీవుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఆ దేశానికి భారత్ నిధుల సాయం చేసేది. కానీ సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఇటీవల బడ్జెట్ లోనూ కోతలు పెట్టింది భారత్.
గతంలో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే మాల్దీవుల సిద్దాంత కర్త హస్సేన్ కురుసే… ఇప్పుడు తమ దేశాన్ని ఆదుకోవాలని ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నారు. మాల్దీవులను రక్షించేది భారత్ మాత్రమే. ఇక్కడి ప్రజల తరపున ప్రార్థిస్తున్నా… తలో ఒక డాలర్ ఇస్తే… మా దేశం అప్పుల బారి నుంచి బయటపడుతుంది అంటూ ట్వీట్స్ పెడుతున్నాడు. ఇదే కురుసే కొన్ని నెలల క్రితం భారత్ మీ హద్దుల్లో మీరు ఉండాలంటూ ట్వీట్స్ చేశారు. మీ సైన్యం వస్తే కాల్చిపారేస్తాం. పాకిస్తాన్ కు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు… మాకు సాయం చేస్తుంది. మీ హెల్ప్ అక్కర్లేదంటూ ట్వీట్స్ చేశాడు. ఇప్పుడు నెటిజెన్స్ ఆ ట్వీట్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
చైనా అండచూసుకొని రెచ్చిపోయిన మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. IMF బెయిల్ అవుట్ ఇచ్చే పరిస్థితి లేదు. చైనా నుంచి 3 బిలియన్ డాలర్లు తిరిగి ఇవ్వాలన్న ఒత్తిడి తప్పడం లేదు. దాంతో మాల్దీవుల్లో మరో సంక్షోభం తప్పదంటున్నారు ఎక్స్ పర్ట్స్.