BARRELAKKA : అప్పుడు అదుర్స్… ఇప్పుడు బెదుర్స్.. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే

తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.

తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా… బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. నిరుద్యోగులకు న్యాయం చేస్తానంటూ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడింది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో పోటీ చేయగా… అప్పట్లో 6 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. కంచె ఐలయ్య, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు బర్రెలక్కను సపోర్ట్ చేశారు. చాలామంది ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు కూడా ఇచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ప్లాన్ వర్కవుట్ అవలేదు. కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.

ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో అయితే బర్రెలక్క పరిస్థితి మరీ ఘోరం. ఆమెకు EVMల్లో 3 వేల 37 ఓట్లు పడితే… పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా మరో 50 ఓట్లు వచ్చాయి. మొత్తం 3 వేల 87 ఓట్లు మాత్రమే దక్కించుకుంది బర్రెలక్క. అంటే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో 20 మంది నిలబడగా… అందులో బర్రెలక్కకు 12వ స్థానం దక్కింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 4 లక్షల 65 వేల ఓట్లు వచ్చాయి. మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఉద్దండులతో పోటీ పడింది బర్రెలక్క. డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఎలాగూ లేకపోయినా… కనీసం అసెంబ్లీకి వచ్చిననన్ని ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది కదా అని పోటీ చేసిన బర్రెలక్కకు నాగర్ కర్నూల్ ప్రజలు గట్టి షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదుర్స్ అనిపించిన బర్రెలక్కని ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు… ఆమెను గుర్తుపట్టిన వాళ్ళు లేరు. నెక్ట్స్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటిల్లో కూడా బర్రెలక్క పోటీ చేస్తుందేమో చూడాలి.