భారత్ లో న్యూస్ కవరేజీ విషయంలో బీబీసీ మరోసారి పక్షపాతం చూపించినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట విషయంలో బీబీసీ అన బుద్దిని బయటపెట్టుకుంది. బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్ (Bob Black) మన్ ఆ దేశ పార్లమెంట్ (Parliament) లో ఈ విషయం లేవనెత్తారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు సంతోషంగా కలిగించింది. కానీ బీబీసీ మాత్రం ఇది ఒక మసీదు విధ్వంసం జరిగిన ప్రదేశం అంటూ తన కవరేజీలో చెప్పడాన్ని బ్రిటన్ ఎంపీ తప్పుబట్టారు.
మసీదు కంటే 2 వేల యేళ్ళకు ముందే అక్కడ దేవాలయం ఉందన్న విషయం బీబీసీ (BBC) మర్చిపోయిందని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్టు హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ తెలిపారు.
బీబీసీ నిస్పాక్షింగా రిపోర్టింగ్ చేయడంలో విఫలమైనందున… సభలో చర్చించేందుకు కొంత టైమ్ కేటాయించాలని ఇతర ఎంపీలను కోరారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని కవరేజ్ చేయాల్సిన బాధ్యత బీబీసీది. కానీ అయోధ్య విషయంలో పక్షపాతంగా రిపోర్టింగ్ చేయడంపై సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు X లో బాబ్ బ్లాక్ మన్ ట్వీట్ చేశారు.