షకీబుల్ కు బిగ్ రిలీఫ్ జట్టుతో పాటే ఉంటాడన్న బీసీబీ

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ కు ఊరట లభించింది. హ‌త్య కేసు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ షకీబుల్ పాక్ పర్యటనలో జట్టుతో పాటే కొనసాగుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అత‌డిని స్వ‌దేశానికి పంపేది లేద‌ని తేల్చి చెప్పింది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 06:00 PM IST

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ కు ఊరట లభించింది. హ‌త్య కేసు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ షకీబుల్ పాక్ పర్యటనలో జట్టుతో పాటే కొనసాగుతాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అత‌డిని స్వ‌దేశానికి పంపేది లేద‌ని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి దోషిగా తేలేంత వ‌ర‌కూ అత‌డు జ‌ట్టుతోనే ఉంటాడని తెలిపింది. దీంతో పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆడేందుకు ష‌కీబ్‌కు లైన్ క్లియరైంది. కేసు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, విచారణకు సహకరిస్తామని బీసీబీ అధ్య‌క్షుడు ఫ‌రూఖీ అహ్మ‌ద్ చెప్పారు. పాక్ టూర్ తర్వాత భారత్ పర్యటనకూ షకీబుల్ అందుబాటులో ఉంటాడని, లీగల్ గా ఎటువంటి సాయం కావాలన్నా అతనికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు