BCCI : ఫాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్… ఇండియాలోనే ఐపీఎల్ మ్యాచ్ లు

సార్వత్రిక ఎన్నికల (General Elections) షెడ్యూల్ వచ్చేసింది. లోక్‌సభ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను విదేశాల వేదికగా నిర్వహిస్తారనే కథనాలు వచ్చాయి.

సార్వత్రిక ఎన్నికల (General Elections) షెడ్యూల్ వచ్చేసింది. లోక్‌సభ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను విదేశాల వేదికగా నిర్వహిస్తారనే కథనాలు వచ్చాయి. మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో (IPL Season 17) తొలి 21 మ్యాచ్‌లకు ఇప్పటికే బీసీసీఐ (BCCI) షెడ్యూల్ విడుదల చేసింది. తర్వాత మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కథనాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించాడు. ఆ వార్తలన్నీ అవాస్తమని అరుణ్ ధుమాల్ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం భారత్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎక్కడకి మార్చట్లేదనీ, మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నాడు.

ఐపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా స్పందించాడు. ఐపీఎల్‌ ఎక్కడికీ తరలిపోదని, మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని జై షా పేర్కొన్నాడు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి మిగతా మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కాగా మార్చి 22న ప్రారంభ మ్యాచ్‌లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.