ఆదాయంలో తగ్గేదే లే భారీగా పెరిగిన బీసీసీఐ రెవెన్యూ

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు... ఎటు చూసినా కాసుల వర్షమే... ఇటు స్పాన్సర్లు, అటు ఐపీఎల్ , మరోవైపు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం.. ఎప్పటికప్పుడు బీసీసీఐ రెవెన్యూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 12:04 PM IST

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు… ఎటు చూసినా కాసుల వర్షమే… ఇటు స్పాన్సర్లు, అటు ఐపీఎల్ , మరోవైపు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం.. ఎప్పటికప్పుడు బీసీసీఐ రెవెన్యూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో 4200 ​కోట్ల మేర పెరుగుదల కనిపించింది. పీటీఐ అందించిన వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. 2024 ముగింపు నాటికి 20,686 కోట్లకు చేరింది. కాగా క్రికెట్‌ ప్రపంచంలో ఐపీఎల్‌ అత్యంత ఖరీదైన లీగ్‌గా కొనసాగుతోంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. అటు ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌ల ద్వారానూ భారీగా సంపాదిస్తోంది.