ఎన్నికలకు ముందు అంతన్నాడు… ఇంతన్నాడు… జగన్ (YS Jagan)… నీకుందిలే అంటూ గొప్పాలు పలికాడు ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు (Raghuramakrishna). నేను స్పీకర్ అవుతున్నా… నిన్ను ఆడుకుంటా అంటూ తన పగను గుర్తు తెచ్చుకొని… దాన్ని జగన్ పై తీర్చుకోవాలని పగటి కలలు కన్నాడు RRR. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు కేబినెట్ లో రఘు రామ కృష్ణంరాజుకు చోటు లేదు. మంత్రి పదవికి మొండిచెయ్యి దక్కింది. స్పీకర్ రేసులో కూడా RRR లేడని అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం కొలువుదీరింది. తమకు గ్యారంటీగా మంత్రి పదవి అనుకున్నవాళ్ళందరికీ షాక్ తగిలింది. సీనియర్లను కాదని ఈసారి 17 మంది కొత్తవాళ్ళకి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు బాబు. మినిస్ట్రీ ఆశశించిన వాళ్ళల్లో రఘురామకృష్ణ రాజు కూడా ఒకరు. తాను స్పీకర్ అవుతానని… అసెంబ్లీలో జగన్ ని ఆడుకుంటానని గప్పాలు కొట్టారు RRR. కానీ అసలాయనకు సీటిచ్చే విషయంలోనే చివరి వరకు టెన్షన్ నడిచింది. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ… తిరిగి నరసాపురం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఎంపీ సీట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. 30యేళ్ళుగా పార్టీని నమ్ముకున్న శ్రీనివాస్ వర్మకే టిక్కెట్ కన్ఫమ్ చేసింది. ఆ తర్వాత చంద్రబాబు పంచన చేరారు RRR. అప్పటికే అన్ని స్థానాల్లో సిటింగ్స్, మాజీల నుంచి గట్టి పోటీ ఉంది. కానీ చివరకు ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని RRRకు టీడీపీ సీటు ఇచ్చారు చంద్రబాబు. ఉండిలో గెలిచారు.
చంద్రబాబు దగ్గర తనకున్న పలుకుబడితో… తనకు మంత్రి పదవి కాకపోయినా అసెంబ్లీ స్పీకర్ ఇస్తారని ఆశించారు రఘురామకృష్ణరాజు. కానీ టీడీపీలో ముందు నుంచీ ఉన్న సీనియర్లకే పదవులు రాలేదు. ఈసారీ పోటీ ఎక్కువగా ఉండటంతో… మంత్రి పదవులు రాని అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేతలు స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. దాంతో ఆ పోస్టు కూడా గోవిందా… RRRకు అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా దక్కే ఛాన్స్ లేదంటున్నారు. ఇప్పుడున్న 11 సీట్లతో జగన్ అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు గానీ… RRR కి మాత్రం అసెంబ్లీ స్పీకర్ పదవి రాకుండా పోతోంది. అంటే రఘురామ కృష్ణ రాజు పాపం… ఇక… ఎమ్మెల్యే పోస్టుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.