నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. తాను ఏ పాపం చేయలేదు అంటూ చిందులు వేసిన హేమ… పోలీసు విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. బిర్యాని వీడియోలు చేసినా మీడియా మీద రెచ్చిపోయినా… మేడం గారు బెంగళూరు శివారు ఫాం హౌస్ లో ఆడిన ఆటలు అన్నీ పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో చార్జ్ షీట్ నమోదు చేసారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.
9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణకు వచ్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. హేమ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్ట్ జత చేసారు. ఆమె స్నేహితుడు వాసు ఆమెను రేవ్ పార్టీకి పిలిచినట్టుగా పోలీసులు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. మొత్తం 1086 పేజీల చార్జ్ షీట్ ని కోర్ట్ కి సమర్పించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెంగళూరు సిసిబి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. కాగా బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ పలు మార్లు చెప్పారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం నుంచి హేమ ఒక వీడియో విడుదల చేసి తన ఫాం హౌస్ లో ఉన్నా అని ఏదో హడావుడిగా వీడియో విడుదల చేసారు. ఆ తర్వాత హడావుడిగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెను పోలీసులు తీసుకెళ్ళి డ్రగ్స్ పరిక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తాను ఏం చేయలేదని అసలు డ్రగ్స్ తీసుకోలేదని అక్కడే మీడియాపై అరిచారు. తనను కావాలని ఇరికించారు అంటూ మాట్లాడారు హేమ. ఇక పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారు. ఈ సందర్భంగా తాను ఏ పాపం చేయలేదని పదే పదే చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసారు హేమ.