Bengaluru water crisis: మేం అధికారంలోకి వస్తే బెంగళూరుకు నీటి సమస్య లేకుండా చేస్తాం అంటూ హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్.. మా బోరు కూడా ఎండిపోయింది.. మా ఇంట్లో కూడా నీళ్ళు రావట్లేదని మొత్తుకుంటున్నారు. పైగా ప్రైవేట్ ట్యాంకర్ రూ.3వేలకు కొంటున్నానని చెప్పడం వైరల్‌గా మారింది. సిలికాన్ సిటీ బెంగళూరులో జనం తాగునీటికి అల్లాడుతున్నారు.
TSPSC: అలర్ట్.. గ్రూప్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారు..
వర్షాభావ పరిస్థితులతో సిటీలో బోరు బావులు ఎండిపోయాయి. దాంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కాలనీలకు 10 రోజులకోసారి కూడా నీళ్ళు అందడం లేదు. రోజువారీ నీటి వినియోగం మీద రెసిడెన్షియల్ సొసైటీలు ఆంక్షలు పెడుతున్నాయి. ఈ సంక్షోభంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయం స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు. కొన్ని ఏరియాల్లో 600 రూపాయలకు ట్యాంకర్ సరఫరా చేస్తుంటే.. మరికొన్ని చోట్ల రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నారని అన్నారు. ధరలను రెగ్యులరైజ్ చేసేందుకు నీటి ట్యాంకర్ల ఓనర్లు అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలని ఆదేశించారు శివకుమార్.
ట్యాంకర్లు ప్రయాణించిన దూరం ఆధారంగా ధరలను నిర్ణయిస్తామన్నారు. నీళ్ళు వృథా కాకుండా చూసుకోవాలనీ.. పొదుపుగా వాడుకోవాలని డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రజలకు సూచిస్తున్నారు. నీళ్లు వృథా చేస్తే భారీగా జరిమానాలు వేస్తామని హౌసింగ్ సొసైటీలను హెచ్చరించారు.