వీర్యకణాల అనేది పురుషులలో అత్యంత ముఖ్యమైనవి.. సృష్టి మనుగడకు అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నది. సాధారణంగా వీర్యకణాలు శుక్రకణాలు అని అంటారు. ఇది కర్బన ద్రవము రూపంలో ఉండి.. జీవుల పుట్టుకకు కారణమవుతుంది. మానవులలో పురుషాంగం నుండి స్రవించబడుతుంది. ( విడుదలవుతుంది) స్రీ,పురుషులు/భార్యభర్తలు రతి క్రిడాలో పాల్లోన్నప్పుడు శరిరంలో ఉన్న హర్మోన్లు ఉత్తేజితం అయ్యే పురుషాంగం ద్వారా శుక్రకణాలు స్త్రీ యోనిలోకి విడుదలవుతాయి. అనంతరం స్త్రీ అండాశయంలోకి ప్రవేశించి అండంలోని కేంద్రకంతో.. క్షయకరణ విభజన జరిగి.. పురుషుని శుక్రకణంలోని X,Y క్రోమోజోములు స్త్రీలోని.. X-X కలిస్తే స్త్రీగాను.. X-Y కలిస్తే పురుషునిగానూ ఫలదీకరణం చెంది పిండం ఏర్పడుతుంది. ఆ పిండము 9 నెలల తర్వాత స్త్రీ రూపంలో, పురుష రూపంలో బయటకు వస్తుంది.
ఏ దశలో వీర్యోత్పత్తి జరుగుతుంది..?
ప్రతి పురుషునిలో శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేందుకు ఒక వయసు ఉంటుంది.. దాని వయస్సు సాధారణంగా కౌమారదశ అని అంటారు. అంటే 15 నుంచి 18 వయసు గల ప్రతి ఒక్కరిలో ఈ వీర్యకణాలు ఉత్పత్తి అనేది మొదలైవుతుంది. అనంతరం పురుషుడు ఆరోగ్య సమయంను బట్టి అది జీవితాంతం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. వృదాప్యంలోనూ కూడా.. మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం.. కారణాలైవైనా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీని ప్రభావం సంతాన సౌఫల్యతపైన పడుతుండగా.. మున్నుందు ఇతర ఆరోగ్య సమస్యలకూ ఇది దారితీస్తుందని ఆరోగ్య నిపుణఉలు హెచ్చరిస్తున్నారు.
శుక్ర కణాల తగ్గుదలపై ప్రపంచ నివేదిక..
1973-2018 మధ్య కాలంలో 53 దేశాల్లోని 57 వేల మందితో చేపట్టిన సర్వేలో వీర్యకణాల సంఖ్య సగటున సగానికి తగ్గినట్టు గుర్తించారు. వివరాలు ‘హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచ దేశాల్లో భారతదేశంలో సహా పురుషుల్లో వీర్యకణాల వృద్ధి 62శాతం తగ్గుదల కనిపించిందని ‘హీబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫఎసర్ హగాయ్ లెవిన్’ తెలిపారు. తల్లి గర్భంలో ఉన్నపుడే కాలుష్యకారకాల ప్రభావం, ఎదిగే వయసులో అనారోగ్య అలవాట్లు, మొబైల్, ల్యాప్ టాప్ ల నుంచి వెలువడే రేడియే షన్.. ఇవన్నీ ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఒకప్పుడు 40 ఏళ్ల దాటినవాళ్లలో ఈ సమస్య కనిపించగా, ఇప్పుడు యువకుల్లోనూ సాధారణమైపోయింది. వీర్య కణాల తగ్గుదల సంతానంలో జననేంద్రియాల సమస్యలకీ దారి తీస్తుందింటారు నిపుణులు. ఇటీవల సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగిందని అన్నారు.
ఈ దేశంలో శుక్రకణాల తగ్గుదల కనిపిస్తుంది..
1973 నుండి ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల వృద్ధి 50 శాతం నుంచి 62 శాతం క్షీణించింది. 1973 నుంచి 2011 మధ్యకాలంలో అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పురుషులలో స్పెర్మ్ కౌంట్ 50శాతం కంటే ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎమిటంటే 40 ఎళ్ల వయసులో రావలస్సిన సమస్య 2018 నుంచి 2023 మద్య కాలంలో యువకుల్లో కూడా ఈ సమస్య విపరితంగా పెరిగిపోయింది.
వీర్య కణాలు తగ్గిన వాళ్ళు వీరే ఎక్కువ..
“స్పెర్మ్ కౌంట్” శాతం ఎక్కువగా తగ్గుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
“స్పెర్మ్ కౌంట్” శాతం ఏం చేయాలి..? పెంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
పోషకాహారం, వ్యాయామం, తగినంత నిద్ర, బీపీ, మధుమేహం రాకుండా చూసుకోవడం, మధ్య-ధూమపానాలకు దూరంగా ఉండటమే ఈ సమస్యకు పరిష్కారమంటున్నారు నిపుణులు.
సరైన షోషకాలతో ఉన్న ఆహారం అంటే.. గుడ్లు, మాంసం, పండ్లు, పాలు జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్, ఎండు ద్రాక్ష, వంటివి తీసుకుంటే వీర్యం వృద్ధికి తోడ్పతుతాయి. విటమిన్-సి, విటమిన్-ఇ, ఫోలేట్ యాసిడ్, జింగ్ మొదలైనవి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని నిపుణులు చెప్పుత్నారు.
S.SURESH