ఏదైనా ఫలితాలు విడుదలవుతున్నాయంటే చాలు ఎక్కడలేని బంధుత్వాలు ఫోన్‌లో పలకరిస్తుంటాయి. మార్కులు ఎక్కువొస్తే పర్లేదు.. మంచి ర్యాంక్ వస్తే నో ప్రాబ్లెమ్..! ఒకవేళ తక్కువ మార్చులొచ్చాయా ఇక మన పని అంతే..! తల్లిదండ్రులు..చుట్టూ ఉన్నవాళ్లు.. బంధువులు సూటిపోటి మాటలతో మెంటల్ ఎక్కిస్తారు. మనమీద మనకే కాన్ఫిడెన్స్ పోయేలా చేస్తారు. అయితే ఈ ర్యాంకులు, మార్కులు కెరీర్‌ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లు కావు.
స్కిల్స్ ఇంపార్టెంట్:
టెన్త్, ఇంటర్, బీటెక్‌లో 90శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్లకు కెరీర్ బాగుంటుందని చెప్పడానికి ఎలాంటి ఫ్రూఫ్ లేదు. మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్నా.. ఖాళీగా ఇంట్లోనే ఉండి జాబ్ ట్రయల్స్ చేస్తున్న వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. యావరేజ్ మార్కులతో మంచి ప్లేస్‌మెంట్స్ తెచ్చుకున్న విద్యార్థులు కూడా మన ముందే తిరుగుతుంటారు. దీనిబట్టే అర్థమవుతుంది కదా.. అసలు బయట మార్కెట్ ఎలా ఉంది.. మన చదువులు ఎలా ఉన్నాయన్న విషయం! ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని విద్యార్థులను కంపెనీలు తీసుకోవు. పేపర్‌పై సైంటిస్టు లెవల్‌లో ఆన్సర్ చేసి తీరా ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత బెసిక్ కాన్సప్ట్‌పై అడిగే క్వశ్చన్స్‌కి సమాధానం ఇవ్వలేకపోతే ఎన్నీ మార్కులొచ్చినా వ్యర్థమే!
మూడీగా ఉండొద్దు:
కొంతమంది బాగా చదువుతారు.. మంచి టాలెంట్ కూడా ఉంటుంది. బట్టి కొట్టకుండానే గొప్ప స్కోర్ సాధిస్తారు..అయితే బయటకు అసలు మాట్లడరు..అదే వాళ్లే కొంపముంచుతుంది. నలుగురిలో డిస్కషన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్ ఇప్పుడు మోస్ట్ కామన్ థింగ్ ఇన్ మెనీ జాబ్స్. మీటింగ్‌లు, డిస్కషన్స్ లేకుండా కంపెనీలు నడవవు. ఏదో మన పని మనం చేసుకొని వెళ్లిపోయామా అంటే కుదరదు.. అక్కడే ఆగిపోతాం. మనలోని టాలెంట్ కంపెనీకి తెలియాలి అంటే అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి. అయితే ఇవన్ని ముందునుంచే అలవాటు చేసుకోవాలి. ఏదో రోబో లాగా కీ ఇస్తేనే కదులుతాం..మాట్లాడుతాం అని కాకుండా నేచురల్‌గానే ఈ స్కిల్‌ని డెవలప్ చేసుకోవాలి.
క్రిటికల్ థింకింగ్ స్కిల్స్:
క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ విషయానైనా లోతుగా విశ్లేషించగలగాలి. ఇది తెలియకపోతే ఎవరూ ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మేస్తారు. అప్పుడు మనం మోసపోయే అవకాశాలుంటాయి. అకడమిక్ సబ్జెక్టులపై లోతైన అవగాహన కోసం ఈ స్కిల్ సహాయపడుతుంది. ఎవరూ ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఉండే క్వాలిటీని స్కూల్ స్టేజ్ నుంచే అలవాటు చేసుకోవాలి.
టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్:
టైమ్ సెన్స్ లేకపోతే మనలో ఎంత టాలెంట్ ఉన్నా అది వేస్ట్. స్కూల్‌కే టైమ్‌కి వెళ్లకపోతే ఇక జాబ్‌కి ఎలా టైమ్‌కి వెళ్తాం.? అటు ఏ విషయానికి ఎంత టైమ్ కేటాయించాలన్నది కూడా చాలా ముఖ్యం. స్టడీస్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి.. గేమ్స్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి..సినిమాలకు షికార్లకు ఎంత టైమ్ ఇవ్వాలన్నది ఇంపార్టెంట్. అయితే అందరూ చదువుకే ఎక్కువ టైమ్ ఇవ్వాలని లేదు. మన గోల్ ఏంటి అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్:
కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు. వినడం కూడా అని. ముందు వినడం రావాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. వినడం వస్తే మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం వస్తే రాయడం వస్తుంది. ఇదంతా విద్యార్థులు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినడం వలన కూడా మనం వాళ్లకి ఎంత విలువ ఇస్తున్నామో అర్థమవుతుంది. అలాగే ఎదుటివారికి మనం చెప్పడానికి ఎంచుకునే పదాలు కూడా చాలా ముఖ్యం. మనం ఎంచుకునే పదాలు మన వ్యక్తిత్వాన్ని తెలిసేలా చేస్తాయి. అటు బాడి లాంగ్వేజ్ కూడా అన్నీటికంటే ముఖ్యం. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. అప్పుడు మనం చెప్పే విషయం మీద అతనికి ఆసక్తి కలుగుతుంది. మన ఆత్మ విశ్వాసాన్ని కూడా ఇది చూపిస్తుంది.
రీసెర్చ్ స్కిల్స్:
ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఈ విషయానికి దూరమవుతున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ విషయంపై పూర్తి పట్టు సాధించే అవకాశాలు ఎక్కువ. అన్నీ వనరులు ఉంచుకొని కూడా విద్యార్థులు రీసెర్చ్‌ని పక్కన పెడుతున్నారని నిపుణులు వాపోతున్నారు. మనం కెరీర్‌లో పైకి ఎదగాలంటే రీసెర్చ్ స్కిల్స్ చాలా అవసరం. ఏ విషయానైనా కొత్తగా చూడండి.. అందులో తెలియని రహాస్యాలను కనిపెట్టేందుకు ప్రయత్నించండి. అప్పుడు సబ్జెట్‌పై పూర్తిస్థాయి పట్టు వస్తుంది. ఇది మీ కెరీర్‌కి తిరుగే లేకుండా చేస్తుంది. ఇలాంటివి అన్ని పక్కన పెట్టీ.. కేవలం మార్కులతోనే కుస్తీ పడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మార్కులతో పాటు ఇతర స్కిల్స్‌పై కూడా విద్యార్థులు ఫోకస్ చేయాల్సిన అవసరముంది.