Bhadradri Talambralu: భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు.. రూ.151 చెల్లిస్తే మీ ఇంటికే

ఈ కల్యాణోత్సవాన్ని నేరుగా హాజరై, చూసే అవకాశం లేని భక్తులు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు దీనికోసం రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలి.

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 08:27 PM IST

Bhadradri Talambralu: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలు నేరుగా భక్తుల ఇంటికే అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. గత ఏడాదిలాగే ఈసారి కూడా.. దేవాదాయ శాఖ సహాయంతో తలంబ్రాలను భక్తుల వద్దకు చేర్చే పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం భద్రాచలంలో ఏప్రిల్‌ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.

GOLD PRICES: మండిపోతున్న బంగారం.. తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..

ఈ కల్యాణోత్సవాన్ని నేరుగా హాజరై, చూసే అవకాశం లేని భక్తులు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు దీనికోసం రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ.. భక్తులకు హోం డెలివరీ చేస్తుంది. టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించి కూడా ఈ సేవను వినియోగించుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. 22023లో 1.17 లక్షల మంది భక్తులు తలంబ్రాలను స్వీకరించారని సజ్జనార్ వెల్లడించారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ తలంబ్రాలను ఎంతో నిష్ఠతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలతో తయారు చేస్తారు. అందుకే భక్తులు ఇష్టంగా స్వీకరిస్తారు.