ఆమె కళ్ళు కోసమే ఆమె నటించిన సినిమాలు చూసే వాళ్ళు. ఆమె సంప్రదాయ నృత్యం చేసినా….మోడరన్ డాన్స్ చేసినా చూడటానికి జనం విరగబడేవారు. 80- 90లలో అగ్ర హీరోలందరితో టాలీవుడ్ స్క్రీన్ ని ఆదరగొట్టింది భానుప్రియ. సితార, స్వర్ణ కమలం, ఖైదీ నెంబర్ 786, దొంగమొగుడు, ప్రేమించు పెళ్లాడు.. ఇలా ఎన్నో సినిమాల్లో భాను ప్రియ నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఇలాంటి అమ్మాయిని లైఫ్ పార్థనర్ గా పొందాలని అలనాటి యూత్ అనుకునేవారట. భాను ప్రియను పెళ్లి చేసుకోవాలని డైరెక్టర్ వంశీ ఆశించారు. కానీ కుదర లేదు. ఆమెని పెళ్లి చేసుకుంటామని ఇండస్ట్రీలో చాలా మంది ప్రపోజ్ చేశారు. ఆమె సున్నితంగానే తిరస్కరించింది. బయటి వ్యక్తిని పెళ్లాడింది. ఆ తరవాత సినిమాలు తగ్గించుకుంది. భర్తతో విభేదాలు వచ్చాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. తరవాత మళ్ళీ దగ్గరైన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు.
చాలా బాధాకరమైన విషయం ఏంటంటే… భాను ప్రియకి మెమొరి లాస్ వచ్చేసింది. అన్నీమర్చిపోతోంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చాలా సంచలన విషయాలు చెప్పిందామె. ఏమి గుర్తు ఉండటం లేదని… మర్చి పోతున్నానని ఆవేదనతో చెప్పుకొచ్చింది. తనకు అత్యంత ఇష్టమైన నృత్య భంగిమలు… ముద్రలు కూడా గుర్తు పెట్టు కోలేక పోతోందట. డైలాగ్స్ పలకడం కూడా సరిగ్గా రాకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గాయట.
పెదరాయుడు.. ఛత్రపతి తరవాత భాను ప్రియకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చాయి. కానీ ఆ తరవాత ఆమె సొంత సమస్యలతో ఆమె సినిమాలు చేయలేక పోయారు. ఇప్పుడు ఎవరికైనా భాను ప్రియని చూస్తే ఏడుపు వస్తుంది. ఆమె లో చిరునవ్వు మాయం అయింది. కాలం ఎన్ని మార్పులు తెస్తుందో..!