తెలంగాణ (Telangana) భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో (Telangana) తీవ్ర ఎండలతో ఐఎండీ (IMD) వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. HYD, ఉమ్మడి RRలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గమనార్హం. ఉ.8 నుంచి మొదలు సా.5 వరకు వేడి గాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడ్చల్లో 42.6, మూసాపేట 41.9, మల్కాజిగిరి 41.5, అంబర్పేట్ 41.4, ఉప్పల్ 41.3, ముషీరాబాద్ 41.2, చార్మినార్ 41.1, మెహదీపట్నం 41.0, ఇబ్రహీంపట్నం 41.6, వికారాబాద్ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో (Telangana) తీవ్ర ఎండలతో ఐఎండీ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.