Bharateeyudu 2 Review : ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ

లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు.

 

 

లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు. దాదాపు ఐదేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 1996లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాలో సేనాపతిగా.. చంద్రబోస్ గా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. అంతేకాదు లంచగొండి తనాన్ని సహించని భారతీయుడు ..సేనాపతి.. తన కుమారుడిని చంపేసి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్లీ దేశంలో అరాచకం, లంచగొండితనం అనేది ప్రభలుతుంది. దీన్ని అరికట్టడానికి మళ్లీ సేనాపతి విదేశాల నుంచి మన దేశానికి వస్తాడు. ఈ క్రమంలో అవినీతి పరులను ఎలా అంత మొందించాడనేదే ఈ ‘భారతీయుడు 2’ స్టోరీ.

రిలీజ్ కు మరికొన్ని గంటలు మిగిలి ఉండగానే… సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సందు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా మైండ్ బ్లోయింగ్ అని కమల్ నటన అదిరిపోయిందని సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు.ఈ ఏడాది వచ్చిన పవర్ ఫుల్ అండ్ బెస్ట్ సినిమా అని చూస్తుంటే మజా వస్తుందని సినిమాకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు. శంకర్ మార్క్ తో పాటు విజువల్ ట్రీట్ అదిరిపోతుందని చేసిన కామెంట్స్ తో కమల్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. క్లైమాక్స్ లో పార్ట్ 3 కి ఇచ్చిన హింట్ నెక్ట్స్ లెవల్ అనేశాడు. సిద్ధార్ధ్ కి పవర్ ఫుల్ దొరికిందని… చెప్పుకొచ్చాడు.

దశావతారం సినిమాలో కమల్ హాసన్ పది గెటప్స్ లో కనిపిస్తే.. భారతీయుడు 2లో మాత్రం 12 గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తమిళంలో ఇండియన్ 2 పేరుతో విడుదలైతే.. హిందీలో హిందూస్తానీ పేరుతో విడుదల చేస్తున్నారు. మొత్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్స్ ఎనిమిది రోజులు పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా సినిమాలకు దూరమైన మధ్యతరగతి వారు.. ఈ సినిమాను ఏ మేరకు థియేటర్స్ లో ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి.