Congress : ప్రతీచోట రేవంత్‌ పక్కనే భట్టి.. ఇంత ప్రాధాన్యం ఇందుకేనా..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన చూపించడంతో పాటు.. పార్టీలో ఎలాంటి చిన్న అలజడి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. కనిపిస్తున్న దృశ్యాలు అదే చెప్తున్నాయి. కూడా ! కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరు ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన చూపించడంతో పాటు.. పార్టీలో ఎలాంటి చిన్న అలజడి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. కనిపిస్తున్న దృశ్యాలు అదే చెప్తున్నాయి. కూడా ! కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరు ఉంది. అందుకే సీఎం అయినప్పటి నుంచి.. అందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఎవరినీ నొప్పించకుండా అందరూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి నిర్ణయాలే తీసుకుంటున్నారు.

ప్రతీ విషయంలో పార్టీలోని సీనియర్ నాయకులను సంప్రదిస్తూ.. అందరి ఆమోదాన్ని తీసుకునే తన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. పార్టీలో తనకు శత్రువులు ఎవరు తయారు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగతా సంగతి ఎలా ఉన్నా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేవంత్‌. ప్రతీ నిర్ణయంలో భట్టి విక్రమార్కను భాగస్వామ్యం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉన్నా.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా.. భట్టిని వెంటేసుకొని వెళ్తున్నారు. ఆయనతో పాటు.. ఆయనను పక్కన ఉంచుకునే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రగతి భవన్‌లో నివాసం ఉండేందుకు సీఎంగా రేవంత్‌కు అవకాశం ఉన్నా.. దాన్ని భట్టి విక్రమార్కకే వదిలిపెట్టారు.

కీలకమైన ఆర్థిక శాఖను కూడా ఆయనకే అప్పగించారు. నామినేటెడ్ పదవులలోనూ భట్టి విక్రమార్కతో చర్చించి, పార్టీ పెద్దలతో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఇక అటు ప్రధానిని రేవంత్‌ కలిసిన సమయంలోనూ.. భట్టి విక్రమార్క పక్కనే కనిపించారు. ఇలా పదవులు వేరు కావొచ్చు కానీ.. అందరం ఒకటే అనే సంకేతాలను.. అటు జనాలతో పాటు పార్టీ వర్గాల్లోకి తీసుకెళ్తున్నారు రేవంత్‌. ఐతే భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం పెంచడం వెనక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. నిర్ణయాల విషయంలో ఏదైనా తేడా వస్తే.. మొదటగా భట్టి నుంచే ఎక్కువ ముప్పు ఉంటుందని రేవంత్ గ్రహించారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రతి విషయంలో ఆయనకు ఆ స్థాయిలో ప్రాధాన్యం కనిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.