విజయవాడకు మరో వరద ముప్పు పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితం ఇబ్రహీంపట్నం సమీపంలోని కవులూరు, ఈలప్రోలు మధ్య భారీగా బుడమేరు వరద పెరిగింది. నిన్న సాయంత్రానికి ఇప్పటికి నాలుగు అడుగులు వరద పెరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరద 8 అడుగులుగా ఉంది. ఇప్పటికే బుడమేరు వరదతో 4 రోజుల నుంచి అల్లాడిపోతున్న బెజవాడ ప్రజలకు ఈ వరద మళ్ళీ వస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది.
మూడు గండ్లు పడితే అధికారులు ఒక గండిని పూడ్చగా మరో రెండు గండ్లు నుంచి వరద భారీగా వస్తోంది. కవులూరు, ఈలప్రోలు, వెలగలేరు సహా పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ముప్పుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులు అంటున్నారు. వరద ప్రాంతాల్లో ఉన్న బాధితులకు డ్రోన్ లు, హెలికాప్టర్ ల ద్వారా ఆహారాన్ని చేరవేస్తున్నారు.