Zomato : జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్.. అదనపు ఫీజు వసూలు..

జొమాటో (Zomato) కస్టమర్లకు బిగ్ షాక్ తగులుతుంది. జొమాటో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్.. ప్రస్తుత యువతకు.. ఆఫ్ బాయ్స్ కు, ఐటీ ఎంప్లాయిస్ కి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు.

 

 

జొమాటో (Zomato) కస్టమర్లకు బిగ్ షాక్ తగులుతుంది. జొమాటో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్.. ప్రస్తుత యువతకు.. ఆఫ్ బాయ్స్ కు, ఐటీ ఎంప్లాయిస్ కి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒక్క 5 – 6 సంవత్సరాలవ వరకు ఫుడ్ అంటే ఇంట్లో నుంచి తేచ్చుకోవడం.. లేదంటే బయట రెస్టారెంట్ కి వెళ్లి తిని వచ్చేవాళ్ళం.. ఇప్పుడు కాలం మారింది. కాలానికి తగ్గ యువత మారింది. నిజానికి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఎక్కువగా మెట్రో నగరాల్లో.. ఐటీ కారిడార్ లో.. ఐటి రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఫుడ్ ఆడర్ చేసుకోని తినేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే.. ఇంట్లో ఉండి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇంట్లో స్వతాగా వండుకునేందుకు ఓపిక లేక 5 నిమిషాల్లో అంత రాణి అన్నట్లుగా.. ఇలా ఫోన్ లో నచ్చిన ఐటైం (ఆహరం) ఆర్డర్ పెడితే ఇండి ముందుకు వచ్చి మరి ఇచ్చేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ ఎక్కువ అవ్వడంతో జొమాటో మార్గంలో పలు రకాల యాప్స్ వచ్చాయి.

ఇక్కడ మాత్రం మనం జొమాటో గురించి మాట్లాడుకుంటున్నాం..
గత కొంది రోజులుగా ఫుడ్ డెలివరీ సంస్థలకు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగానే.. ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కస్టమర్లకు డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ వంటివి కష్టంగా ఉండగా.. దినికి అదనంగా కొంత కాలం కిందట ప్రవేశపెట్టిన ప్లాట్‌ఫాం ఫీజు కూడా భారీగా భారం అవుతుంది. దీంతో ఫుడ్ డెలివరీ మరింత ప్రియంగా.. వ్యయంగా మారింది. గతంలో స్విగ్గీ బాటలోనే జొమాటో కూడా ఫుడ్ డెలివరీలపై ప్లాట్‌ఫాం ఫీ ప్రవేశపెట్టగా.. ఇది అంచలంచలుగా పెరిగిపోతోంది. తాజాగా ఈనె ఏప్రిల్ 20 నుంచే.. ఒక ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూ. 5 వసూలు చేయనున్నట్లు స్పస్టమైంది. ఇది గంతో ఉన్న రేటుతో పోలిస్తే 25 శాతం అదనం కస్టమర్లపై భారం పడుతుంది. తొలిసారిగా జొమాటో.. 2023 ఆగస్టులో ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వత
ఆర్డర్‌పై రూ. 2 గా ఉండేది. కొన్ని నెలల తర్వాత అక్టోబర్‌లో దీనిని రూ. 3 కు పెంచింది. జనవరిలో రూ. 4 కు పెంచగా.. ఇదే జోమాటో కంపెనీ ప్లాట్‌ఫాం ఫీజును రూ. 4 నుంచి 5 కు పెంచిన వినియోగ దారులపై భార పడేట్లు చేస్తుంది.

కాగా ఈ ప్లాట్‌ఫాం ఫీజు దేశ వ్యాప్తంగా పెరగలేదని తెలుస్తుంది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో వంటి ప్రధాన నగరాల్లో జొమాటో ఈ ప్లాట్‌ఫాం ఫీజు పెంచింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఫుడ్ ఆర్డర్లపై రూ. 5 చొప్పున ప్లాట్‌ఫాం ఫీజు ఎప్పటినుంచో వసూలు చేస్తోంది. ఏదేమైనా చివరికి వినియోగదారులపైనే భారం పడుతుందని స్పష్టంగా అర్థమైవుతుంది.

SSM