ARMUR PANDU : ఆర్మూరు పాండుకు బిగ్ షాక్.. షాపింగ్ మాల్ ఆర్టీసీ స్వాధీనం

బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కి ఆర్టీసీ (RTC) అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆర్మూరులో ఆయనకు చెందిన మాల్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

 

 

బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కి ఆర్టీసీ (RTC) అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆర్మూరులో ఆయనకు చెందిన మాల్ ను స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని TSRTC రద్దు చేసుకున్నట్టు ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో తెలిపారు. ఆర్టీసీ స్థలంలో మాల్ నిర్మించి… కోట్లల్లో అద్దెలు వసూలు చేసుకుంటూ… BRS ప్రభుత్వం అండతో ఆర్టీసీకి డబ్బులు చెల్లించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఆర్టీసీ అధికారులు స్ట్రిక్ట్ గా వ్యవహరించడంతో ఆర్మూరు పాండు (Armuru Pandu) కు పెద్ద షాక్ తగిలింది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బస్టాండ్ కి దగ్గర్లో 7వేలకు పైగా స్వ్కేర్ ఫీట్ ల్యాండ్ ను 33యేళ్ళకు విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ కంపెనీ BOT కింద లీజుకు తీసుకుంది. ఈ కంపెనీని 2017లో జీవన్ రెడ్డి భార్య రజితా రెడ్డి టేకోవర్ చేసుకున్నారు. ఆ షాపింగ్ మాల్ కి జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీఫ్లెక్స్ అని పేరు పెట్టారు. ఆ మాల్లో షాపులను అద్దెకు ఇచ్చి… కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జీవన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటంతో… పాండు ఆడింది ఆటగా సాగింది. 2023 అక్టోబర్ నాటికి 8కోట్ల రూపాయలు బకాయిపడ్డా… ఆర్టీసీ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. అప్పట్లో నోటీసులు జారీ చేశాక దాదాపు 4 లక్షల దాకా చెల్లించింది జీవన్ రెడ్డికి చెందిన కంపెనీ. అయితే ఆర్టీసీ షోకాజ్ నోటీసులపై జీవన్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. కానీ కోర్టు ఆర్టీసీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. నెల రోజుల్లోగా ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని మార్చి 27న కోర్టు ఆదేశాలిచ్చింది. అది ప్రజల సొమ్ము… బకాయిలు చెల్లించకపోతే… రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీసికి పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. ఆర్మూరు పాండు ఇప్పటికీ ఇంకా బకాయిలు ఉండటంతో… ఆర్టీసీ అధికారులు మాల్ ను తమ స్వాధీనం చేసుకున్నారు. జీవన్ రెడ్డి కంపెనీ ఇంకా 2 కోట్ల 51 లక్షల రూపాయలను ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని గత ఐదేళ్ళల్లో 20 నోటీసులు ఇచ్చినా విష్ణుజిత్ కంపెనీ స్పందించలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో తెలిపారు.

ఆర్టీసీ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ముందు సజ్జనార్ పై ఈసీకి కూడా కంప్లయింట్ చేసింది. బకాయిలు అడగటం నేరమైనట్టు… అది తమ ఎంపీ అభ్యర్థిపై ప్రభావం పడుతుందని అర్థం పర్థం లేని ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ను తప్పించాలనీ… సస్పెండ్ చేయాలని కూడా ఈసీకి బీఆర్ఎస్ పార్టీ కంప్లయింట్ చేయడం విచిత్రం. ఇప్పుడు మాల్ స్వాధీనం చేసుకొని… ఆర్మూరు పాండుకు గట్టి షాక్ ఇచ్చింది ఆర్టీసీ.