BRS కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ.. ?

తాజాగా బీఆర్ఎస్ కీలక నేత కూతురు హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwala Vijayalakshmi) బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధం మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ (Telangana)లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha elections) వేళ రాజకీయాల్లో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోవడం.. కాంగ్రెస్ (Congress) లో అధికారం దక్కించుకోవడం ఇలా చకచక జరిగిపోయాయి. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా అధికార పార్టీ కాంగ్రెస్లోకి వలసలు కడుతున్నారు. కాంగ్రెస్ ఇంకాస్త ముందుకు వచ్చి మేం గేట్లు తెరిచాం అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనడంతో.. పనిగట్టుకుని మరీ కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది.. అది కూడా లోక్ సభ ఎన్నికల సందర్భంగా.. తాజాగా పరిణామాలు చూస్తుంటే.. కాంగ్రెస్ కొత్త.. ఆపరేషన్ హైదరాబాద్ గా మొదలు పెట్టింది. ఇది వరకే హైదరాబాద్ లోని 10 మంది బీఆర్ఎస్ కార్పోరేటర్స్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరొకరి ఖైరతాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోని.. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరొకరు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bontu Rammohan) సహ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరొకరు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత సైతం పార్టీ వీడి.. కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కీలక నేత కూతురు హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwala Vijayalakshmi) బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధం మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు వార్తలే అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ GHMC మేయర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వనించేందుకు వెళ్లారు. మేయర్ తో దీపాదాస్ మున్షీ చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

కాంగ్రెస్ లోకి రావాలని తనను దీపాదాస్ మున్షీ ఆహ్వానించారని నగర మేయర్ గద్వాల విజయలక్షీ తెలిపారు. రెండు సార్లు తనను గెలిపించిన కార్యకర్తలతో చర్చించి తర్వాత తన నిర్ణయం చెప్తానని. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని మీడియాతో వెల్లడించారు. కాగా ప్రస్తుతం మేయర్ గద్వాల విజయలక్ష్మి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

కాగా బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కీలక మైన నేత.. కేసీఆర్ కుడి భూజం అయిన ఎంపీ కే కేశవరావు కూమార్తెనే గద్వాల విజయలక్ష్మీ.. ఈమె 2016 GHMC ఎన్నికల్లో గద్వాల విజయలక్ష్మి BRS పార్టీ తరఫున రెండు సార్లు బంజారాహిల్స్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. 2021 సీల్డ్ కవర్ ద్వారా హైదరాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు.

 

SURESH SSM