Himaja: సినీ నటి హిమజ (himja) ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని, ఆమెను పోలీసులు అరెస్టు చేశారని ఆదివారం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఇంటి నుంచి మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే, ఈ వార్తలపై నటి హిమజ స్పందించారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తాను అరెస్టు కాలేదని, ఇంట్లోనే ఉన్నానని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Naga Chaitanya, : మేక్ఓవర్ కోసం అష్టకష్టాలు పడుతున్న చైతు.. న్యూ లుక్ వర్క్ అవుట్ అవుతుందా.. ?
హిమజ మాట్లాడుతూ ”నేను ఇంట్లో చాలా హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకొంటున్నా. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి దీపావళి అని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పిలుచుకుని లక్ష్మీ పూజ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా. ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. ఈ తరుణంలో ఎవరో నా ఇంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిపార్ట్‌మెంట్‌వాళ్లు వచ్చి చెక్ చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి వారి డ్యూటీ వాళ్లు చేశారు. మేమంతా పోలీసులకు సహకరించాం. దీనికే పలు ఛానళ్లు, న్యూస్ యాప్స్ రేవ్ పార్టీ అంటూ నా గురించి చెడ్డగా ప్రచారం చేశారు.
ఈ విషయాన్ని టీవీలో చూసి మా బంధువులు, సన్నిహితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నా గురించి తప్పుడు ప్రచారం చేసిన వారికోసం ఈ వీడియో చేసి పోస్ట్ చేశాను. పూజ చేసుకోవలసిన సమయంలో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. పోలీస్ స్టేషన్లో లేను’ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేశారో తెలీదు కానీ అవన్నీ నమ్మవద్దు” అని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆమె పూజకు ఇంట్లో అన్నీ సిద్ధం చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిజానికి హిమజ ఇటీవల తను కొత్తగా కట్టుకున్న డ్రీమ్‌హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆ ఇంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేసిందని, న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదు చేశారని, దీంతో ఆమెను పోలీస్‌లు అరెస్ట్ చేశారని ప్రచారం మొదలైంది.