SONU GOUD : బిగ్ బాస్ భామకు.. 14 రోజుల కస్టడీ

పిల్లలను దత్తత తీసుకున్న కేసులో కన్నడ (Kannada) బిగ్ బాస్ (Bigg Boss) కంటెస్టెంట్ సోనుగౌడకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పిల్లలను దత్తత తీసుకున్న కేసులో కన్నడ (Kannada) బిగ్ బాస్ (Bigg Boss) కంటెస్టెంట్ సోనుగౌడకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఓ పాపను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ… దత్తతకు సంబంధించిన అన్ని రూల్స్ పాటించినట్టు ఆమె చెబుతోంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనుగౌడ (Sonugawda) 45 రోజుల క్రితం అర్థరాత్రి టైమ్ లో ఓ బాలికను తన పేరెంట్స్ తో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. దత్తత తీసుకునేటప్పుడు రూల్స్ పాటించకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సోనుగౌడను మొదట ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. కస్టడీలో అనేక విషయాలు బయటపడ్డాయి. చిన్నారిని దత్తత తీసుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్టు…ఆ పాపతో రీల్స్ చేయించి పబ్లిసిటీ సంపాదించినట్టు సోనుగౌడ ఒప్పుకుంది. అక్రమంగా బిడ్డను దత్తత తీసుకోవడంతో పాటు… ఆ తర్వాత నిబంధనలను కూడా పాటించలేదని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హిందూ దత్తత చట్టం ప్రకారం ఈ ప్రక్రియ జరగలేదని గుర్తించారు. సోనుగౌడ పోలీస్ కస్టడీ ముగిశాక పోలీసులు తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు ఏప్రిల్ 8 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. దత్తత విషయంలో రూల్స్ ఉల్లంఘించినందుకు సోను గౌడకు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉందని న్యాయనొపుణులు చెబుతున్నారు.