బ్రేకింగ్: ములుగులో ఏం జరుగుతోంది…? జిల్లాకు భారీగా సీసీ కెమెరాలు

తెలంగాణాలో మావోయిస్ట్ ల కదలికలు మళ్ళీ మొదలయ్యే అవకాశం కనపడటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులు పహారా కాయలేని ప్రాంతాల్లో భారీగా రహస్య కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 09:14 AM IST

తెలంగాణాలో మావోయిస్ట్ ల కదలికలు మళ్ళీ మొదలయ్యే అవకాశం కనపడటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులు పహారా కాయలేని ప్రాంతాల్లో భారీగా రహస్య కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా అంతా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన మొట్టమొదటి జిల్లాగా గుర్తింపు పొందింది ములుగు. అణువణువు కెమెరా క్యాప్చర్ అయ్యే విధంగా జిల్లా వ్యాప్తంగా 376 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు పోలీసులు.

ములుగు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక పై మేడారం, బొగత జలపాతాలు, లక్నవరం, రామప్ప దేవాలయం, గోదావరి పరివాహక ప్రాంతం అంతటా సీసీ కెమెరాల నిఘా నీడ పెంచారు. మావోయిస్టుల కదలికలు పసిగట్టేలా మూడో కన్ను నిఘా ఏర్పాటు చేసారు. జాతీయ రహదారి పై ప్రమాదాలు డెంజర్ స్పాట్స్ వద్ద కెమెరాల ఏర్పాటు చేసారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ తో పాటుగా సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు.