Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ.. మూడు నెలలపాటు చికెన్ షాపుల మూసివేత

నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని అధికారులు సూచించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 06:25 PM IST

Bird Flu: ఏపీలోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో, పశు సంవర్థక శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కిలోమీటర్ పరిధిలో ఎక్కడా చికెన్ షాపులు తెరిచి ఉంచకూడదని, వాటిని మూడు నెలల పాటు మూసివేయాలని కూడా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. మృతిచెందిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు అధికారులు.

YS SHARMILA: షర్మిలను బలిచేస్తున్న కాంగ్రెస్‌.. ఆమెకు ఆ చాన్స్‌ ఎందుకివ్వలేదు?

ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కాణమని అధికారులు నిర్ధరణకు వచ్చారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని అధికారులు సూచించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది. అందుకే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు నిర్దేశించారు. భోపాల్‌లో జరిపిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ బయటపడటంతో వ్యాధి మరింత విస్తరించకుండా చూడాలని ప్రభుత్వం యంత్రాంగం నిర్ణయించింది. బర్డ్ ఫ్లూ విస్తరించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అధికారులకు, ప్రజలకు సూచించారు. వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి 15రోజుల వరకు కోళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, బయట నుంచి కోళ్లు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ లోపు వ్యాధి ఏయే జిల్లాలకు వ్యాపించిందో స్పష్టత లేదు. అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాలకు కూడా నెల్లూరు నుంచి కోళ్లు వెళుతుంటాయని, అందువల్ల ఆ ప్రాంతాల్లో కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

కోళ్లతో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని, వ్యాధి ప్రబలిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలని, ఆయా గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు. సాధారణంగా బర్డ్‌ఫ్లూ వ్యాధి పక్షుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. గాలిద్వారా ఇది వ్యాపిస్తుంది. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజా పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడటానికి చాలా ఆలస్యమైంది. వ్యాధిని గుర్తించడం, చర్యలు తీసుకోవడంలో అధికారయంత్రాంగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.