BIRYANI SALES: బిర్యానీ.. ఓయో రూమ్స్.. న్యూ ఇయర్‌కు వీటిదే హవా..

హైదరాబాద్ సిటీలో 4 లక్షల 80 వేల బిర్యానీ ప్యాకెట్లను డెలివరీ చేసింది స్విగ్గీ. అంటే నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. చివరి గంటలో 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 08:19 PM IST

BIRYANI SALES: న్యూ ఇయర్ జోష్.. కొత్త ఏడాది మొదటి రోజు.. జనవరి ఫస్ట్ నాడు.. జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలిరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు బుక్ అయ్యాయి. ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో కూడా రికార్డులు బద్దలయ్యాయి. అయితే విచిత్రం ఏంటంటే.. రాముడి జన్మస్థలం అయోధ్యలోనే ఓయో రూమ్స్ బుకింగ్స్ ఎక్కువగా అయ్యాయి. హైదరాబాద్‌లో చాలామంది బిర్యానీతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా.. జొమాటో, స్విగ్గీ సంస్థలు రికార్డు స్థాయిలో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేశాయి. హైదరాబాద్ సిటీలో 4 లక్షల 80 వేల బిర్యానీ ప్యాకెట్లను డెలివరీ చేసింది స్విగ్గీ. అంటే నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

చివరి గంటలో 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ ప్రకటించింది. జొమాటోకి అయితే 2015 నుంచి 2020 మధ్య కాలంలో ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో.. అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్ 31నే వచ్చాయట. దాదాపు 3 లక్షల 20 వేల జొమాటో డెలివరీ పార్టనర్లు.. ఈ ఆర్డర్లను అందించారు. జొమాటోకి ఎక్కువగా మహారాష్ట్రలోనే ఆర్డర్స్ బుక్ అయ్యాయి. కోల్‌కతాలో ఓ వ్యక్తి ఏకంగా 125 ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ చేశాడు. ఇంకా చెప్పాలంటే జొమాటో డెలివరీ బాయ్స్‌కి డిసెంబర్ 31న.. ఒక్క రోజులోనే 97 లక్షల రూపాయల దాకా టిప్స్ వచ్చాయట. స్విగ్గీ ఇన్‌స్టా‌మార్ట్‌కి కూడా డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయట. వరల్డ్ కప్ ఫైనల్ రోజు కంటే ఎక్కువగా, 1.6 రెట్లు అధికంగా 2023 ఏడాది చివరి రోజు ఆర్డర్స్ వచ్చాయంటోంది స్విగ్గీ. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున ప్రతి గంటకు 17 వందల యూనిట్ల కండోమ్ ఆర్డర్స్ కూడా డెలివరీ చేశామని తెలిపింది ఇన్‌స్టా‌మార్ట్. ఇంకా కిరాణా సామాన్లలో.. రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, లక్షా 80 వేల కిలోల బంగాళ దుంపలను కూడా జనం ఆర్డర్ చేశారట.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఓయో రూమ్స్‌కి కూడా ఫుల్లు డిమాండ్ వచ్చింది. 2022తో పోలిస్తే 37శాతం ఎక్కువగా.. 2023లో 6లక్షల 20 వేల బుకింగ్స్ వచ్చాయి. అయితే వీటిల్లో డిసెంబర్ 30, 31 తేదీల్లో ఏకంగా 2 లక్షల 30 వేల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. పవిత్ర రామమందిరం నిర్మించిన అయోధ్యలో.. గత ఏడాదితో పోలిస్తే 70 శాతం ఎక్కువగా, గోవాలో 50శాతం, నైనిటాల్‌లో 60శాతం ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ అయినట్టు నిర్వాహకులు తెలిపారు. ఫుడ్ ఆర్డర్స్‌లో మాత్రం హైదరాబాదీలు మరోసారి భారీగా బిర్యానీలు ఆర్డరిచ్చి రికార్డులకెక్కారు.