Telangana BJP: సిద్ధిపేట్‌లో బీజేపీకి షాక్‌.. పార్టీకి చక్రధర్‌ గౌడ్‌ రాజీనామా.. బీఎస్పీ నుంచి పోటీ..

అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా కండువా కప్పి చక్రధర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధిపేట్‌ నుంచి హరీష్‌ రావుకు పోటీగా చక్రధర్‌ పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చక్రధర్‌ కూడా టికెట్‌ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 05:25 PM IST

Telangana BJP: తెలంగాణ రాజకీయాల్లో కీలక సెగ్మెంట్‌గా ఉన్న సిద్ధిపేట్‌లో బీజేపీకి పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ చక్రధర్‌ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీ నుంచి బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజల క్రితం మహిళపై అత్యాచారయత్నం కేసులో చక్రధర్‌ అరెస్ట్‌ అయ్యారు. అయితే ఆ కేసు మంత్రి హరీష్‌ రావు ఉద్దేశపూర్వకంగా పెట్టించారంటూ చక్రధర్‌ భార్య రోడ్డెక్కారు. ప్రతిపక్ష నేతలు కూడా చక్రధర్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చక్రధర్‌ గౌడ్‌ పేరు మార్మోగింది.

REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి

జైలు నుంచి వచ్చిన తరువాత చక్రధర్‌ గౌడ్ బీజేపీలో జాయిన్‌ ఆయ్యారు. అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా కండువా కప్పి చక్రధర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధిపేట్‌ నుంచి హరీష్‌ రావుకు పోటీగా చక్రధర్‌ పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చక్రధర్‌ కూడా టికెట్‌ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ లాస్ట్‌ మినట్‌లో చక్రధర్‌కు టికెట్‌ రాలేదు. బీజేపీ హైకమాండ్‌ శ్రీకాంత్‌ రెడ్డికి టికెట్‌ ఫైనల్‌ చేసింది. దీంతో నిరాశకు గురైన చక్రధర్‌.. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంతకాలం తనకు సహరించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అయితే చక్రధర్‌ ఎన్నికలకు దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించనవి విధంగా ఆయన బీఎస్పీ కండువా కప్పుకున్నారు.

బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ రావడంతో ఆయన ఆ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి చక్రధర్‌ నామినేషన్‌ వేయబోతున్నారు. దీంతో సిద్ధిపేట్‌లో బీజేపీకి పెద్ద షాక్‌ తగిలినట్టైంది. ఇప్పటికే రాష్ట్రంలో నంబర్‌ త్రీ స్థానానికి పడిపోయింది బీజేపీకి. చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా కష్టమే అనే టాక్‌ నడుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో పార్టీకి ఓట్లు తెచ్చే నేతలు కూడా వేరే పార్టీలోకి వెళ్లిపోవడం బీజేపీకి గొడ్డలిపెట్టుగా మారుతోంది.